– పోలీసు అధికారులతో డీజీపీ శివధర్ రెడ్డి వీసీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27 : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిల పోలీసు అధికారులు కృషిచేయాలని డీజీపీ బి.శివధర్ రెడ్డి ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై రాష్ట్రంలోని పోలీసు అధికారులతో ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ కమిషనరేట్ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు మొదలుకొని స్టేషన్ హౌస్ ఆఫీసర్ల స్థాయి వరకు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికలు సజావుగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం ఎన్నికలు ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో శాంతిభద్రతల అదనపు డీజీపీ మహేష్ ఎం భగవత్, మల్టీ జోన్-2 అడిషనల్ డీజీపీ డి.ఎస్.చౌహాన్, మల్టి జోన్-1 ఐజీపీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, ఏఐజీ రమణ కుమార్, లీగల్ అడ్వైజర్ ఇ.రాములు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



