హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 21: గ్రామాల్లో సర్పంచ్ లేకపోవటం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గ్రామాల్లో సర్పంచ్‌లతో ఉన్న ఉపయోగాలు తనకు తెలుసునని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. సర్పంచ్‌ల గొప్పతనంపై ముచ్చర్ల సత్యనారాయణ ఎప్పుడో పాట రాయడం చాలా గొప్ప విషయమంటూ ఆ పాటను గాత్ర రూపంలో ప్రజల ముందుకు తీసుకొచ్చిన పృధ్వికి అభినందనలు తెలిపారు. రవీంద్రభారతిలో ముచ్చర్ల సత్తన్న పంచాయతీ పాటను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి ఆమె ఆవిష్కరించారు.
ముచ్చర్ల సత్తన్న పంచాయతీ పాట ఆవిష్కరణ




