పాలమూరు పేరుతో మోసం

– పదేళ్లలో ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు
– రూ.27 వేల కోట్లు ఖర్చు.. ఫలితం సున్నా
– పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులే లేవు
– రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.7వేల కోట్లు ఖర్చు
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23 పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను పదేళ్లపాటు మోసం చేసిందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 27 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి బీఆర్ఎస్ నా యకులు దుర్మార్గంగా అబద్ధాలు ప్రచా రం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమా ర్ రెడ్డి విమర్శించారు. పాలమూ రు ప్రాజెక్టు కేంద్రం నుంచి కానీ, న్యాయ పరమైన కానీ ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. కేసీఆర్ 45 టీఎంసీకి ఒప్పుకు న్నట్టు చెబుతున్నది పూర్తిగా అవాస్తవమ ని, హరీష్ రావు మాయమాటలతో ప్రజల ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరో పించారు. కేసీఆర్ ప్రభుత్వానికి పాల మూరు ప్రాజెక్ట్ కట్టాలనే ఉద్దేశమే లేదని మంత్రి అన్నా రు. 2020లో కేంద్రానికి పంపిన నీటి వాటాల పంపకాల ప్రతిపాదనల్లో పాల మూరు, ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులకు నీళ్లు కూడా అడగలేదని గుర్తు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 1.83 లక్షల కోట్ల రూపాయలు ఇరిగేషన్ కు ఖర్చు చేసినా ఒక్క ఎకరా కు నీళ్లు ఇవ్వలేదని తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో నిర్మించిన ప్రాజెక్టుల ద్వారానే నీటి పంపిణీ జరి గిందని, కొత్తగా బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినదేమీ లేదని అన్నారు. రాయల సీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పేరుతో ఆంధ్రప్రదేశ్ నీటి దోపిడీకి కేసీఆర్ ప్రభుత్వం సహక రించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ స్కీమ్ పనులను నిలిపివే శామని తెలిపారు. పాలమూరు ప్రాజెక్ట్ కోసం గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 7 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, ఆ నిధుల లెక్కలను ప్రజలకు వెల్లడి స్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ను వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. హరీష్ రావు కమిషన్లపై ఆరోపణలు చేస్తున్నారని, అలాంటి అలవాట్లు తమ ప్రభుత్వానికి లేవని స్పష్టంగా చెప్పారు. కేసీఆర్ కుటుంబం ఏదో అద్భుతాలు చేసినట్టు వ్యాఖ్యలు చేస్తోందని విమర్శించారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారమే నడుస్తుందని, ఆంధ్రా వారికి కాంట్రాక్టులు ఇచ్చిన విషయాలపై సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని మంత్రి ఉత్తమ్ ప్రశ్నించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *