పాలమూరుకే తొలి ప్రాధాన్యం

-పదేళ్లు ఈ జిల్లాను ఎండబెట్టిన కేసీఆర్‌

– ఎం‌పిగా గెలిపించినా పట్టించుకోని నేత
– గ్రీన్‌ చానల్‌ ద్వారా ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తున్నాం
– మూసాపేట కార్వింగ్‌ కంపెనీలో రెండో యూనిట్‌ ప్రారంభం
– వకాశాలను అందిపుచ్చుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు

మహబూబ్‌నగర్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 3:  ఒకప్పుడు పాలమూరు వలసల జిల్లాగా ఉండేదని సీఎం రేవంత్‌ ‌రెడ్డి గుర్తు చేశారు. ఎక్కడ తట్ట పని, పార పని ఉన్నా పాలమూరు జిల్లా వారే కూలీలని తెలిపారు. అందుకు ప్రధాన కారణం మనం చదువులో వెనకబడి ఉండటమే అని పేర్కొన్నారు. స్వరాష్ట్రం వస్తే.. అభివృద్ధి జరుగుతుందని భావించామని చెప్పుకొచ్చారు. కానీ తెలంగాణ వచ్చాక కూడా అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముసాపేట మండలం వేముల కార్నింగ్‌ ‌కంపెనీలో రెండవ యూనిట్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అప్పట్లో పాలమూరు విశ్వవిద్యాలయం కేవలం ఒక ఏ కాలేజీలా మాత్రమే ఉండిందని గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రాన్ని నడిపించే అవకాశం వచ్చిందని తెలిపారు. ఇపుడు విద్యా, ఉపాధి, అవకాశాలను జిల్లా అంది పుచ్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పట్లో దివంగత నేత ఇందిరా గాంధీ ఎస్సీ,ఎస్టీలకు భూములు అసైన్‌ ‌చేసిందని పేర్కొన్నారు. ఇపుడు చదువుకుంటేనే తలరాత మారుతుందని స్పష్టం చేశారు. రు చదువుకోవాలంటే కావలసిన వసతుల కల్పన బాధ్యత తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. గ్రీన్‌ ‌ఛానల్‌ ‌ద్వారా జిల్లా ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు.పాలమూరు జిల్లా ఒకనాడు వలసలకు మారుపేరు అని సిఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ ‌జిల్లా మూసపేటలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి పర్యటించారు. అనంతరం ఏర్పాటు- చేసిన సభలో ఆయన మాట్లాడుతూ పాలమూరు బిడ్డల భాగస్వామ్యం లేకుండా ఏ ప్రాజెక్టు నిర్మాణం జరగలేదని పేర్కొన్నారు. చదువు, నీళ్లు జిల్లా ప్రజలకు అందుబాటులో లేక వలసలు పోయారు. కృష్ణా జలాలు పక్క నుంచి వెళ్తున్నా తాగు, సాగు నీటి సమస్యలు ఉన్నాయి. సమస్య పరిష్కారానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేయలేదు. తెలంగాణ ఉద్యమంలో పాలమూరు జిల్లా అండగా నిలిచింది. కెసిఆర్‌ ‌మహబూబ్‌నగర్‌ ఎం‌పిగా గెలిచి గెలిచార‌ని, సీఎం కూడా అయ్యార‌న్నారు. కెసిఆర్‌ను ఎంపిగా గెలిపించినా తమ ప్రాంతానికి సముచిత న్యాయం జరగలేదని సిఎం రేవంత్‌  ‌మండిపడ్డారు.పేరుకే పాలమూరు వర్సిటీ అయినా పిజి కాలేజీగానే మిగిలింది. చదువు, ఉపాధి, నీటిపారుదలలో జిల్లాను అభివృద్ధి చేసుకోవాలి. ప్రణాళికలు రచించుకోకపోతే జిల్లాకు శాశ్వతంగా అన్యాయం జరుగుతుంది. జిల్లాకు ట్రిపుల్‌ ఐటీని మంజూరు చేసుకున్నాం. 14 అసెంబ్లీ స్థానాల్లో యంగ్‌ ఇం‌డియా స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి జిల్లా వేదిక కాబోతోందని సిఎం స్పష్టం చేశారు.కొడంగల్‌, ‌నారాయణపేటకు ఎత్తిపోతల పథకం తెస్తే..  ఫిర్యాదు చేస్తున్నారుని ఆరోపించారు. అక్కడ భూసేకరణ కోసం వెళ్తే రైతులు కొడంగల్లో ఇచ్చినట్లు రూ. 20 లక్షలు డిమాండ్‌ ‌చేస్తున్నారని వివరించారు. కొడంగల్‌ ‌పరిస్థితి వేరు.. నారాయణపేట పరిస్థితి వేరు అని స్పష్టం చేశారు. నారాయణపేట వారికి కావాలంటే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. ఇక్కడ భూసేకరణ కోసం మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, కలెక్టర్‌లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలు ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయని రేవంత్‌ ‌రెడ్డి మండిపడ్డారు. డియా కూడా లేనిపోని వార్తలకు అపోహలకు తావు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ బ్రహ్మోస్‌ ‌మిస్సైల్‌ ఉత్పత్తి చేపట్టేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్స్‌డ్‌ ‌టెక్నాలజీ సెంటర్‌లకు స్థలాలను చూపించండని కోరారు. గతంలో మన పేదరికాన్ని చూపేందుకు పాలకులు టోనీ బ్లెయిర్‌ను తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇపుడు మన అభివృద్ధిని.. ప్రాజెక్టులను విద్యా సంస్థలను చూపించేందుకు వివిధ దేశాల నాయకులను పిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కుర్చీలో కూర్చున్న ప్రతి నాయకుడు.. ఆయనను నమ్ముకున్న ప్రజలకు మొదటి ముద్దను పెట్టాలని రేవంత్‌ ‌పేర్కొన్నారు. తనకు ఏ అవకాశం వచ్చినా మొదటి ముద్ద పాలమూరుకు పెడతా అని ధీమా వ్యక్తం చేశారు. ఒకప్పుడు రాష్ట్రంలో ఏ పార్టీ ఉండకూడదని చూసిన వారు.. ఇపుడు వాళ్లకు వాళ్లే కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *