మా యుద్ధ విమానాలకు పెరిగిన గిరాకీ

– ఇక మాకు ఐఎంఎఫ్‌ ‌రుణం కూడా అక్కర్లేదు
– పాక్‌ ‌రక్షణ మంత్రి ఖవాజా ప్రగల్భాలు

ఇస్లామాబాద్‌,‌జనవరి 8: ఆపరేషన్‌ ‌సిందూర్‌తో చావుదెబ్బతిన్నా..పాక్‌ ‌మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే ఉంది. ప్రగల్భాలతో ప్రపంచాన్ని బురిడీ కొట్టించాలని చూస్తోంది. తాజాగా పాక్‌ ‌రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ‌డియాతో మాట్లాడుతూ భారత్‌తో యుద్ధం తర్వాత తమ యుద్ధ విమానాలకు ఎక్కడలేని గిరాకీ వచ్చిందని, అవి హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయన్నారు. ఇకపై తమ ఆర్థిక కష్టాలు తీర్చేందుకు ఐఎంఎఫ్‌ ‌రుణం కూడా అవసరం ఉండకపోవచ్చని పగటి కలలు కంటున్నారు. గతేడాది మే నెలలో భారత్‌తో నాలుగు రోజుల పాటు జరిగిన యుద్ధం తర్వాత పాకిస్థాన్‌కు రక్షణ ఆర్డర్లు పెరిగాయి. అవి ఏ స్థాయిలో అంటే.. ఆరు నెలల తర్వాత మాకు అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి రుణాల అవసరం ఉండకపోవచ్చని, పాక్‌ ‌మిలిటరీ సామర్థ్యాలు ప్రపంచం దృష్టిలో పడ్డాయని ఖవాజా వ్యాఖ్యలు చేశారు. ఖవాజా మాటలకు, పాక్‌ ‌ప్రభుత్వ చర్యలకు ఏమాత్రం పొంతన లేదు. కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఐఎంఎఫ్‌ ‌నుంచి కొన్నేళ్లుగా పాకిస్థాన్‌ ‌నిధులు అర్థిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిధులు పొందేందుకు గాను ఐఎంఎఫ్‌ ‌సూచించిన సంస్కరణల్లో భాగంగా పాక్‌కు చెందిన అంతర్జాతీయ విమానయాన సంస్థను అమ్మేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. ఇక, 2026-2027 బ్జడెట్‌లో కొన్ని సడలింపులు, సబ్సిడీలు ఇవ్వాలని షెహబాజ్‌ ‌షరీఫ్‌ ‌ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకోసం రుణషరతులపై మినహాయింపులు ఇవ్వాలని ఐఎంఎఫ్‌ను కోరుతోందని స్థానిక డియా కథనాలు వెల్లడించాయి. ఖవాజా చెప్పినట్టుగా పాకిస్థాన్‌ ‌యుద్ధవిమానాలు జేఎఫ్‌-17, ‌జే-10కు దొరికిన బయ్యర్లు అజర్‌బైజాన్‌, ‌లిబియాలు మాత్రమే. బంగ్లాదేశ్‌ ఇం‌కా చర్చలు జరుపుతోంది. అయితే, జేఎఫ్‌-17‌కు రష్యా, చైనా, ఇటలీ, తుర్కియే, యూకేకు చెందిన పరికరాలను దాయాది అమర్చుతోంది. ఇంజిన్‌ ‌రష్యాది కాగా.. దాని డిజైనర్‌, ‌తయారీదారు చైనా. అందులో పాక్‌ ‌తయారీ పరికరాలు పరిమితంగానే వాడుతున్నారు. దాంతో వాటి అమ్మకాల నుంచి వచ్చే ఆదాయంలో తమ వాటాను ఇతర దేశాలు తీసుకోగా.. షరీఫ్‌ ‌ప్రభుత్వానికి వచ్చేది అంతంతమాత్రంగానే ఉంటుందని పాక్‌ ‌రాజకీయ విశ్లేషకులు వెల్లడించారు. ఒకవేళ జేఎఫ్‌-17‌ను 15 మిలియన్‌ ‌డాలర్లు, జే-10ను 40 మిలియన్‌ ‌డాలర్లకు విక్రయించినా.. 2026 ప్రారంభం వరకు ఉన్న 300 బిలియన్‌ ‌డాలర్ల అప్పులకుప్పను తొలగించుకోగలదా..? అని ప్రశ్నిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *