– ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాం
– ఉత్తర్వు కాపీలు అందాక తదుపరి కార్యాచరణ: మంత్రి పొన్నం
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్ 9: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడం బాధాకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ అందిన తరువాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ప్రభుత్వం తరుఫున హైకోర్టులో బలమైన వాదనలు వినిపించడం జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం కుల సర్వే నిర్వహించి, డెడికేటెడ్ కమిషన్ వేసి, సబ్ కమిటీ వేశామని గుర్తు చేశారు. అనంతరం కేబినెట్ ఆమోదించి శాసనసభలో చట్టం చేసి గవర్నర్‌కి బీసీ బిల్లును పంపడం జరిగిందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని మంత్రి పొన్నం పేర్కొన్నారు. హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీలు హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదో జవాబు చెప్పాలని పొన్నం నిలదీశారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ నాయక్వతంలో సామాజిక న్యాయంతో ఎన్నికలకు వెళ్తామని మంత్రి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే