– కవిత సస్పెన్షన్‌లో కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా
– మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్
మెదక్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 4: ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే,మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీపై విమర్శలు చేసి కవిత తనకు తానే గొయ్యి తవ్వుకున్నారని విమర్శించారు. కవిత తన తీరుతో పార్టీకి ఎంతో నష్టం చేశారు. బీఆర్‌ఎస్‌కు సంపద వంటి వ్యక్తి హరీష్ రావు.. ఆయనను బలహీనపరిచేలా వ్యాఖ్యలు చేస్తే తెలంగాణకు నష్టం కాదా అని ఆమె ప్రశ్నించారు. కార్యకర్తగా, నేతగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా అందరికీ అందుబాటులో ఉండి పనులు చేసిన వ్యక్తి హరీష్‌రావు. నాడు ఆయన పనితీరును పొగిడిన వారే నేడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని పద్మాదేవేందర్‌రెడ్డి హెచ్చరించారు. ఈటల రాజేందర్ పార్టీ నుండి వెళ్లిపోవడంలో హరీష్‌రావు పాత్ర లేదన్నారు. హరీష్ రావును కవిత టార్గెట్ చేసి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్‌రెడ్డి డైరెక్షన్‌లో ఆమె వెళ్తున్నారని, కేసీఆర్ కుమార్తెగా గౌరవాన్ని నిలుపుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. గతంలో కవిత రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినా పార్టీ నేతలకు సమాచారం ఇవ్వలేదన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





