– తొమ్మిది జిల్లాల డీసీసీబీ పాలక వర్గాలు సైతం..
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: రాష్ట్రం లోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్ల పాలకవర్గాలను రద్దు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు తొమ్మిది జిల్లాల డీసీసీబీ పాలకవ ర్గాలను కూడా ప్రభుత్వం తొలగించింది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2020 ఫిబ్రవరి 13న పీఏసీఎస్ ఎన్నికలు జరిగాయి. ఐదేళ్ల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరితో ముగియగా, ప్రస్తుత ప్రభుత్వం దానిని మరో ఆరు నెలలపాటు (ఆగస్టు 14 వరకు) పొడిగించింది. పొడిగించిన గడువు కూడా ముగిసిపోవడంతో చట్టపరంగా ఆయా పాలక వర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణ యం తీసుకున్నది. వ్యవసాయాభివృద్ధి, రైతులకు రుణాలు ఇతర సేవలను అందించడంలో పీఏసీఎస్లు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రభు త్వం ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికల ద్వారా వీటిని నియమిస్తుంది. ప్రస్తుత పాలకవర్గాల రద్దు నేపథ్యంలో, తదుపరి ఎన్నికలు నిర్వహిం చే వరకు సొసైటీల నిర్వహణకు స్పెషల్ ఆఫీసర్లను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే