44వేలకు పైగా జర్నలిస్టు అక్రిడిటేషన్‌ ‌కార్డులు

– అర్హులందరికీ న్యాయం
– సమాచార శాఖ మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 12: రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్‌ ‌కార్డు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందన్నారు. అక్రిడిటేషన్‌ ‌కార్డుల జారీ విధానం, అక్రిడిటేషన్‌ ‌కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై సచివాలయంలోని తన కార్యాలయంలో సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ ‌సిహెచ్‌. ‌ప్రియాంక, ముఖ్యమంత్రి సిపిఆర్‌వో జి.మల్సూర్‌లతో మంత్రి గురువారం సుదీర్ఘంగా చర్చించారు. పక్రియ పారదర్శకంగా, వేగవంతంగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. అక్రిడిటేషన్‌ ‌జారీకి సంబంధించి జర్నలిస్టు సంఘాలతో సమావేశమై వారి సూచనలు, అభిప్రాయాలను సవివరంగా పరిగణనలోకి తీసుకొని ముందుగా జారీ చేసిన జి.ఓ. 252కి అవసరమైన సవరణలు చేసి జీ.ఓ. 103ను జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ సవరణల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్ ‌మీడియా, ఎలక్ట్రానిక్ ‌మీడియా, డిజిటల్ ‌మీడియా విభాగాల్లో మొత్తం 44,706 అక్రిడిటేషన్‌ ‌కార్డులు పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు. గతంలో సుమారు 23 వేల మందికి మాత్రమే అక్రిడిటేషన్‌ ‌కార్డులు ఉండగా తాజా నిర్ణయంతో దాదాపు 21 వేలకు పైగా కార్డుల సంఖ్య పెరుగుతుందని మంత్రి వివరించారు. 2.50 లక్షల పైగా సర్క్యులేషన్‌ ఉన్న  8  పత్రికలకు 6,256 కార్డులు, 75 వేల నుండి 2.50 లక్షల వరకు సర్క్యులేషన్‌ ఉన్న24 పత్రికలకు 17,784 కార్డులు, 25,001 నుంచి 75 వేల వరకు సర్క్యులేషన్‌ ఉన్న 30 పత్రికలు 3,390, 15,001 నుంచి 25,000 వరకు సర్క్యులేషన్‌ ఉన్న 169 చిన్న పత్రికలు 11,661, 15వేల లోపు సర్క్యులేషన్‌ ఉన్న 113 చిన్న పత్రికలు 226, పీరియాడికల్స్‌కు 624, 20 న్యూస్‌ ఏజన్సీ 68 అక్రిడిటేషన్‌లు పొందుతాయని తెలిపారు. 21 శాటిలైట్‌ ‌ఛానళ్లకు 4,431 కార్డులు, 8 జాతీయ ఛానల్స్‌కు 32, వంద లోకల్‌ ‌కేబుల్‌ ‌ఛానళ్లకు 200, డిజిటల్ ‌మీడియా విభాగానికి 10 కార్డులు మొత్తంగా 44,706 కార్డులు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో రాష్ట్ర, జిల్లాస్థాయిలో 16,056, నియోజకవర్గ, మండలస్థాయిలో 28,650 మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కార్డుల జారీ నిరంతర పక్రియ అని, అవసరాన్నిబట్టి మరోసారి సమావేశమై తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. మీడియా ప్రతినిధుల గౌరవం, భద్రత, సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పొంగులేటి  స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *