– కార్యకర్తల కృషితో సర్పంచ్‌లు గెలిచారు
– కొత్త ప్రజాప్రతినిధులకు అభినందనలు
– బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18: ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు ఆశీర్వాదం, కార్యకర్తల కృషితో హుస్నాబాద్ నియోజకవర్గంలో 108మంది కాంగ్రెస్ తరపున సర్పంచ్‌లుగా విజయం సాధించడం ముదావహమని బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ క్యాంప్ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో 171 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 108 మంది గెలిచారని, 11మంది స్వతంత్రులు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని, కాంగ్రెస్ సర్పంచ్‌లు మొత్తం 119మంది అవుతున్నారని తెలిపారు. నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో 80 శాతానికి పైగా పోలింగ్ జరిగిన గ్రామాలకు అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రజలు ప్రజాస్వామ్యం మీద విశ్వాసంతో ఓటింగ్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చారన్నారు. నియోజకవర్గంలో విద్య, వైద్యం, ఉపాధి కల్పన, వ్యవసాయం, టూరిజం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. సర్పంచ్‌లు తమ స్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కారించే విధంగా ఉండాలన్నారు. హుస్నాబాద్ మండలంలో 17 గ్రామ పంచాయతీలు ఉంటే 13ప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఇద్దరు ఇండిపెండెంట్‌లు గెలిచారని, వారు కూడా కాంగ్రెస్‌లోనే ఉండగా మొత్తం 15 స్థానాలు కాంగ్రెస్ గెలిచినట్లయిందన్నారు. అక్కన్నపేట మండలంలో 38 గ్రామ పంచాయతీలకు 27 కాంగ్రెస్ పార్టీ గెలిచింసశ్రీతీ, ఇద్దరు ఇండిపెండెంట్‌లు మొత్తం కాంగ్రెస్ 29, కోహెడలో 27 గ్రామ పంచాయతీలకు ఒక ఇండిపెండెంట్‌తో కలుపుకుని కాంగ్రెస్ 18 స్థానాలు గెలిచిందని మంత్రి చెప్పారు. చిగురుమామిడిలో 17 గ్రామ పంచాయతీలకు ఒక ఇండిపెండెంట్‌తో కలుపుకుని కాంగ్రెస్ 8స్థానాల్లో గెలిచిందన్నారు. సైదాపూర్ మండలంలో 27 గ్రామ పంచాయతీలకు 19 కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, భీమదేవరపల్లిలో 25 సర్పంచ్‌లకు 15 కాంగ్రెస్, ముగ్గురు ఇండిపెండెంట్ గెలవగా మొత్తం 18 మంది కాంగ్రెస్ అభ్యర్థులున్నారని, ఎలుకతుర్తిలో 20 గ్రామ పంచాయతీలు ఉంటే ఇద్దరు ఇండిపెండెంట్‌లతో కలుపుకుని కాంగ్రెస్ 12 గెలిచిందని తెలిపారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాలను అభివృధి చేస్తామని, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





