అమెరికా ఆస్తులపైనే మా దాడులు

– అరబ్ దేశాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు
– ఇరాన్ విదేశాంగ సహాయ మంత్రి సయ్యద్ ఖతీబ్జాదే

న్యూదిల్లీ, మార్చి 6 : పశ్చిమాసియాలోని అమెరికా ఆస్తులపై మాత్రమే తాము దాడులు చేస్తున్నామని ఇరాన్ విదేశాంగ సహాయ మంత్రి సయ్యద్ ఖతీబ్జాదే వెల్లడించారు. తమ దాడుల వల్ల పొరుగున ఉన్న అరబ్ దేశాల్లో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదన్నారు. దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో తమ దేశం చేపడుతున్న చర్యలను ఆయన సమర్థించారు. యూఎస్ ఆస్తులనే తాము లక్ష్యంగా చేసుకుంటున్నాం. అందుకే తమ దాడుల వల్ల అరబ్ దేశాల్లో ప్రాణ నష్టం సంభవించలేదని ఖతీబ్జాదే అన్నారు. అలాగే ఇటీవల హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధనౌక ఐరిస్ దేనా`75ను యూఎస్ ముంచేసిన సంగతి తెలిసిందే. భారత స్నేహితుల ఆహ్వానం మేరకు ఆ నౌక ఇక్కడికి వచ్చింది. దానిపై అమెరికా దాడి దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. అలాగే దిల్లీ పర్యటనలో భాగంగా ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో భేటీ అయ్యారు. ఇజ్రాయెల్`అమెరికా దాడుల్లో ఖమేనీ సహా పాలనావర్గానికి చెందిన పలువురు ఉన్నతస్థాయి వ్యక్తులు చనిపోయారు. వారి మృతితో ఇరాన్ రాజకీయ వ్యవస్థ కూలిపోతుందని ట్రంప్ ప్రభుత్వం వ్యాఖ్యలు చేస్తోంది. వాటిని ఖతీబ్జాదే తోసిపుచ్చారు. తమ దేశ పాలనా నిర్మాణం వ్యక్తులపై కాకుండా వ్యవస్థలపై ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. ‘ఇరాన్‌లో రాజ్యాంగం ఉంది. ఎవరెవరు ఏయే బాధ్యతలు నిర్వర్తించాలనే దానిపై స్పష్టమైన విభజన ఉంది‘ అని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *