అయినా.. మా సైన్యం అక్కడే 

– స్పష్టం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

వాషింగ్టన్, ఏప్రిల్ 9 : అమెరికా`ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ పూర్తిగా ఒప్పందాన్ని అమలు చేసే వరకు అమెరికా సైనిక బలగాలు అక్కడే కొనసాగుతాయని తెలిపారు. ఇరాన్`అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణకు బుధవారం ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ తమ దేశానికి చెందిన యుద్ధ నౌకలు, విమానాలు, సైనికులు, ఆయుధాలు మొదలైనవి ఇరాన్ పరిసర ప్రాంతాల్లోనే ఉంటాయని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధం ముగింపునకు సంబంధించి పూర్తిస్థాయి ఒప్పందం అమలయ్యే వరకు సైనికులు వెనక్కు వచ్చేది లేదని స్పష్టం చేశారు. ఒప్పందాన్ని ఇరాన్ పాటించకపోతే మునుపెన్నడూ చూడని స్థాయిలో విరుచుకుపడతామని హెచ్చరించారు. హర్ముజ్ జలసంధి సురక్షితంగా ఉండాలని, నౌకాయానం నిరంతరం కొనసాగాలని అన్నారు. ఒప్పందం కుదిరేవరకు అమెరికా సైన్యం అక్కడే విశ్రాంతి తీసుకుంటూ తమ తదుపరి మిషన్ కోసం ఎదురుచూస్తుందన్నారు. మరోవైపు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు భారీగా కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 254 మంది మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. 1,100మందికి పైగా గాయపడ్డారని సమాచారం. ముఖ్యంగా బీరుట్, దక్షిణ లెబనాన్ ప్రాంతాల్లో నష్టం మరింత తీవ్రంగా ఉందని వార్తలు వస్తున్నాయి.

పాక్‌ను ముందు పెట్టి నాటకం : లెబనాన్‌పై దాడులతో మళ్లీ పీటముడి

న్యూదిల్లీ, ఏప్రిల్ 9: తమ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ దేశాలు రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయని పాకిస్థాన్ గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. తనను తాను శాంతిదూతగా చెప్ప్పుకుంటోంది. ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన ది ఫైనాన్షియల్ టైమ్స్ సంచలన కథనాన్ని ప్రచురించింది. అమెరికా ఒత్తిడి కారణంగానే పాకిస్థాన్ మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకొచ్చింది. ఇరాన్, అమెరికాల మధ్య రాజీ కుదిరితే హర్మూజ్ జలసంధి మళ్లీ తెరుచుకుంటుందని అమెరికా భావించింది. అందుకే ఇరాన్‌ను యుద్ధం ఆపేలా ఒప్పించమని పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచింది. ఆ కారణంగానే ఇరాన్‌తో చర్చలు జరిపి అతి కష్టం విÖద రాజీకి ఒప్పించింది. అమెరికాకు సంబంధించినంత వరకు పాకిస్థాన్ మధ్యవర్తి కాదు.. ఇరాన్‌తో సంధి చేసుకోవడానికి ఓ మార్గం మాత్రమేనని ఆ కథనం పేర్కొంది. కాగా, ఇజ్రాయెల్ లెబనాన్‌పై మిస్సైల్ దాడులు చేయడంతో హర్మూజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేసింది. ఇజ్రాయెల్ కారణంగా కాల్పుల విరమణ ఒప్పందం విఫలమయ్యేలా ఉంది. దీంతో ట్రంప్ ఆగ్రహానికి గురయ్యారు. ’అమెరికా ఈజ్ బ్యాక్.. ఇప్పటికే బలహీనపడిన శత్రువును పూర్తిగా నిర్మూలించేందుకు సిద్ధంగా ఉన్నాం.. హర్మూజ్‌ను తెరవకపోతే దాడులు తప్పవు.. ఒప్పందం కుదరకపోతే ఈసారి తీవ్రమైన దాడులు చేస్తాం.. ఇప్పటికే ఇరాన్ చుట్టూ అమెరికా బలగాలున్నాయి.. అణ్వాయుధాలను ఇరాన్ వదలాల్సిందే’నని తన సోషల్ మీడియా ది ట్రూత్‌లో రాసుకొచ్చారు. అమెరికా నిర్ణయానికి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మద్దతు తెలిపారు. అయితే లెబనాన్‌తో కాల్పుల విరమణ ఉండదని చెప్పారు. ఇదిలావుండగా, పది నిమిషాల వ్యవధిలో లెబనాన్‌లోని ప్రలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ సుమారు 100 ఎయిర్ ప్ట్రైక్స్ చేసింది. ఈ దాడుల్లో దాదాపు 180 మంది ప్రాణాలు కోల్పోయినట్లు, 837 మంది గాయపడినట్లు తెలుస్తోంది. 1982 తర్వాత లెబనాన్‌పై జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. అమెరికా` ఇరాన్ మధ్య తాజాగా కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో హిజ్బుల్లాను చేర్చలేదని పేర్కొంటూ లెబనాన్‌లో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక చర్యకు ట్రంప్ మద్దతు తెలిపారు. లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యను ఒప్పందం నుంచి ఎందుకు మినహాయించారని ప్రశ్నించగా హిజ్బుల్లా కారణంగానేనని, అది కూడా త్వరలోనే పరిష్కారమవుతుంది అని ట్రంప్ పేర్కొన్నారు.

పాకిస్థాన్‌పై మాకు నమ్మకం లేదు : ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ 

అమెరికా`ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో మధ్యవర్తిత్వ పాత్ర పోషించిన పాకిస్థాన్‌పై తమకు నమ్మకం లేదని భారత్‌లోని ఇజ్రాయెల్ దేశ రాయబారి రూవెన్ అజార్ పేర్కొన్నారు. ఆయన తాజాగా మాట్లాడుతూ శాంతి చర్చల్లో పాక్ పాత్రపై సందేహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌ను తాము విశ్వసించలేమని, అమెరికా తన స్వప్రయోజనాల కోసం ఆ దేశాన్ని మధ్యవర్తిగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుందని తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఏదేమైనా ఇరాన్‌లో తాము అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు అమెరికాతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే అమెరికా`ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ మద్దతు ఇస్తోందన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం ఇరాన్ వరకే పరిమితం అని, లెబనాన్‌పై తమ దాడులు కొనసాగుతాయని రూవెన్ వెల్లడించారు. ఇరాన్‌పై జరిపిన ఆపరేషన్‌కు, లెబనాన్‌కు ఎలాంటి సంబంధమూ లేదని తెలిపారు. దక్షిణ లెబనాన్ ప్రాంతం నుంచి హిజ్‌బుల్లా మౌలిక సదుపాయాలను పూర్తిగా తొలగించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

నెతన్యాహూకు స్వదేశంలో తీవ్ర వ్యతిరేకత
ప్రధాన ప్రతిపక్ష నాయకుడు యైర్ లాపిడ్ విమర్శలు

టెలిఅవీవ్, ఏప్రిల్ 9: యుద్ధ లక్ష్యాలను సాధించడంలో ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు విఫలమయ్యారని ఇజ్రాయెల్ ప్రతిపక్ష నాయకులు విమర్శలు గుప్పించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు యైర్ లాపిడ్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని, ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఆక్షేపించారు. ఇరాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని రాజకీయ వైఫల్యంగా అభివర్ణించారు. యుద్ధ లక్ష్యాలను సాధించడంలో తీవ్రంగా విఫలమయ్యారని, ఆయన నిర్ణయాలు దేశ భద్రతకు ప్రమాదకరమని యైర్ లాపిడ్ పేర్కొన్నారు. ’మన చరిత్రలో ఇంతటి రాజకీయ విపత్తు ఎన్నడూ జరగలేదు.. అహంకారం, నిర్లక్ష్యం, వ్యూహాత్మక ప్రణాళిక లేకపోవడం వల్ల కలిగిన రాజకీయ, వ్యూహాత్మక నష్టాన్ని పూడ్చడానికి మనకు సంవత్సరాలు పడుతుంది’ అని ట్వీట్ చేశారు. సైన్యం తమకు అప్పగించిన పనులన్నీ పూర్తి చేసిందని, ప్రజలు కూడా అద్భుతమైన సెí్థర్యాన్ని ప్రదర్శించారని, అయితే నెతన్యాహు రాజకీయంగా, వ్యూహాత్మకంగా విఫలమయ్యారని విమర్శించారు. తాను నిర్దేశించుకున్న లక్ష్యాలలో దేనినీ నెతన్యాహు సాధించలేకపోయారన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో నెతన్యాహు దారుణంగా విఫలమయ్యారని మాజీ ప్రధాని నాఫ్తాలి బెన్నెట్ విమర్శించారు. ’నాయకత్వం మనకు భ్రమలు కల్పించింది.. వారి వాగ్దానాలన్నీ ఈ రాత్రి మన మొహం విÖదే పేలిపోయాయి’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ఒప్పందం ఇజ్రాయెల్ భద్రతను ప్రమాదంలో పడేసే ఒక సంపూర్ణ వైఫల్యం అని అభివర్ణించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *