12న ఫార్మసిస్ట్‌ పోస్టులకు జాబ్‌ మేళా

– ‘ఉస్మానియా’ ఎంప్లాయిమెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో..

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబరు 8: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో మెడ్‌ప్లస్‌ ఫార్మసీ ఈ నెల 12న ఉదయం 11 గంటలకు జాబ్‌ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్‌మెంట్‌ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్‌ మేళా నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీలోని ఫార్మసిస్టు, అసిస్టెంట్‌ ఫార్మసిస్ట్‌లకు చెందిన వంద పోస్టులను ఈ జాబ్‌ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎం.ఫార్మసీ, డిగ్రీ చేసిన యువతీయువకులు 18 నుండి 35 సంవత్సరాల వయసు వారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో డిప్యూటీ చీఫ్‌ ఒక ప్రకటనలో తెలియజేశారు. రూ.12,000 నుండి రూ.25,000 వరకు వేతనం ఉండే ఈ ఫార్మసిస్ట్‌ ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాలకు రఘుపతి- హెచ్‌ఆర్‌ను 8247656356 నంబరులో సంప్రదించాలని కోరారు. విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్‌తో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్‌ బ్యూరో వద్ద 12వ తేదీన నేరుగా హాజరు కావాలని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *