– ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్‌లో సేవల బలోపేతంపైనా చర్చ
– హాస్పిటల్‌లోని పాత భవనాల పరిస్థితిపై నివేదిక సమర్పించాలి
– వైద్య, ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: ఉస్మానియా మెడికల్ కాలేజీ అనుబంధ హాస్పిటల్స్‌లో వైద్య సేవల బలోపేతంపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీకి అనుబందంగా ఉస్మానియా హాస్పిటల్‌తోపాటు, నిలోఫర్ హాస్పిటల్, సరోజినీదేవి కంటి ఆస్పత్రి, ఎంఎన్‌జే కేన్సర్ హాస్పిటల్, టీబీ అండ్ చెస్ట్ హాస్పిటల్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, సుల్తాన్ బజార్ మెటర్నిటీ హాస్పిటల్, పేట్లబుర్జు మెటర్నిటీ హాస్పిటల్, ఈఎన్‌టీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్‌లు అనుబంధంగా వైద్యులు విశేష వైద్య సేవలందిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉస్మానియా హెల్త్ హబ్‌గా, బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చారన్నారు. ఉస్మానియా అనుబంధ హాస్పిటల్స్‌లో వైద్య సేవల బలోపేతానికి చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ హాస్పిటల్‌లో వైద్య సేవల బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించారు. హాస్పిటల్‌లోని పాత భవనాల పరిస్థితిపై క్షేత్రస్థాయిలో తక్షణమే పర్యటించి వచ్చే రెండుమూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని టీజీఎంఎస్‌ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్‌కు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు హాస్పిటల్‌లో మౌలిక సదుపాయాల కల్పన, హెచ్‌ఆర్, ఎక్విప్‌మెంట్లు రిపేర్లు, ఆర్‌వో వాటర్ ప్లాంట్, శానిటేషన్, డ్రైనేజీ సిస్టం, ఇన్ఫ్రా, అంతర్గత రోడ్లు, రోగులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఓపీ, ఐపీ సేవలపై వివరాలడిగి తెలుసుకున్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్‌లో మెరుగైన వైద్య సేవలందించేలా అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రి ఆదేశించారు. ఉస్మానియా బ్రాండ్ ఇమేజ్‌కనుగుణంగా వైద్య సేవలందించేందుకు పూర్వవైభవాన్ని తెచ్చేందుకు వైద్య శాఖ అధికారులు కృషి చేయాలన్నారు.
సరోజినీదేవి కంటి హాస్పిటల్‌పై మంత్రి దామోదర చర్చించారు. ఆధునిక కాలానికి అనుగుణంగా హాస్పిటల్‌లో మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేయాలన్నారు. సమీక్షలో హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా, డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్, ఉస్మానియా అనుబంధ మెడికల్ కాలేజీల హెచ్‌వోడీలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



