ఉస్మానియా వైద్యులు ఆదర్శనీయులు

బాలికకు పునర్జన్మ ప్రసాదించినందుకు సీఎం అభినందనలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: కాలేయం పూర్తిగా చెడిపోయి కోమాలోకి వెళ్లి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ పదిహేనేళ్ల బాలికకు ఉస్మానియా హాస్పిటల్‌ వైద్యులు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను దిగ్విజయంగా పూర్తిచేశారు. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌కు చెందిన బీటెక్‌ ఫస్టియర్‌ చదువుతున్న బ్లెస్సీ గౌడ్‌ అనే బాలికకు మరు జన్మను ప్రసాదించారు. జీవన్‌దాన్‌లో సూపర్‌ అర్జెంట్‌ విభాగంలో నమోదు చేసిన 24 గంటల్లో శస్త్రచికిత్స పూర్తి చేశారు. దేశంలోని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఇంత వేగంగా రోగికి ప్రయోజనం లభించడం ఇదే మొదటిసారి అని ఉస్మానియా సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం హెడ్‌ మధుసూదన్‌ పేర్కొన్నారు. సర్కారు దవఖానాకు ఉన్న దురభిప్రాయాన్ని చెరిపివేసి బ్లెస్సీ గౌడ్‌కు 24 గంటల్లోపే కాలేయ మార్సిడి శస్త్ర చికిత్స చేసి పునర్జన్మను ప్రసాదించిన ఉస్మానియా వైదుÊ బృందానికి సీఎం రేవంత్‌రెడ్డి శనివారం అభినందనలు తెలిపారు. ప్రతీ ప్రభుత్వ వైద్యుడికి ఉస్మానియా వైద్యులు ఆదర్శ కావాలని ‘ఎక్స్‌’లో పుస్టు చేశారు. బ్లెస్సీ గౌడ్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నానని ఎక్స్‌ వేదికగా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *