– విచారణకు ‘సిట్’ ఏర్పాటుకు ఆదేశం
– చేవెళ్ల డీసీపీ యోగేశ్ నేతృత్వంలో ‘సిట్’
హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి
రోహిత్ రెడ్డి వ్యవహారంపై బీఆర్‌ఎస్ సీరియస్ : -షోకాజ్ నోటీసులు జారీ
పైలెట్ రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ బిగ్ షాక్ ఇచ్చింది. రోహిత్‌కు పార్టీ అధిష్ఠానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ’డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉన్నట్లు మీడియా ద్వారా వార్తలు వచ్చాయి. అదే విధంగా పోలీస్ కేసు నమోదు అయిన నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి నోటీసులు జారీ చేసినట్లు’ నోటీసుల్లో పేర్కొంది. ఈ వ్యవహారం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రోహిత్ రెడ్డికి పార్టీ ప్రధాన కార్యదర్శి పేరుతో నోటీసులు జారీ అయ్యాయి. ఈ అంశంపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఆదేశించింది. గడువులోపు సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోతే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకుంటామని పార్టీ అధిష్ఠానం హెచ్చరించింది. రోహిత్ రెడ్డి వ్యవహారాన్ని బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలపై వారం రోజుల్లోగా స్పష్టంగా లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణా వ్యవహారాల బాధ్యులు సోమ భరత్ కుమార్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఒక సమావేశంలో హాజరైన సమయంలో, అక్కడ మాదక ద్రవ్యాలు వినిగియోంచారని వివిధ మీడియా నివేదికలు, ఇతర విశ్వసనీయ సమాచారం ద్వారా పార్టీ ఉన్నత నాయకత్వం దృష్టికి వచ్చిందని షోకాజ్ నోటీసుల్లో తెలిపారు. ఈ వార్తలు విస్తృతంగా మీడియాలో ప్రసారం కావడంతో పాటు పార్టీకి, ప్రజల్లో కూడా తీవ్ర ఆందోళనలు కలిగించాయని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఒక బాధ్యతాయుతమైన రాజకీయ సంస్థగా చట్టపరమైన నిబంధనలు, నైతిక విలువలు పాటించడంలో విశ్వాసం కలిగిందని నోటీసుల్లో పేర్కొన్నారు. అక్రమ కార్యకలాపాలు, ముఖ్యంగా మాదకద్రవ్యాలు, మత్త పదార్థాల వినియోగం లేదా వాటితో ఏ విధమైన సంబంధం కలిగి ఉండటాన్ని బీఆర్‌ఎస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఈ సంఘటనలో పైలర్ రోహిత్ రెడ్డి ప్రమేయం ఉందనే ఆరోపణలు పార్టీకి తీవ్రమైన అపకీర్తిని తెచ్చిపెట్టాయని అన్నారు. అలాగే పార్టీ ప్రతితష్ట, విశ్వసనీయతకు భంగం కలిగించే అవకాశాలు కల్పించాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశం మేరకు ఈ నోటీసులు అందిన తేదీ నుంచి 7 రోజుల్లోపు మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలపై జవాబును స్పష్టంగా వివరిస్తూ సమగ్రంగా లిఖితపూర్వక వివరణ సమర్పించాల్సిందిగా నోటీసులు ద్వారా ఆదేశిస్తున్నామని తెలిపారు. ఈ విషయంపై పార్టీ నాయకత్వం సమగ్రంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండాల్సిందిగా ఆదేశించారు. గడువు తేదీలోగా సంతృప్తికరమైన వివరణ సమర్పించకపోతే పార్టీ రాజ్యాంగం, నియమావళి ప్రకారం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే పై తగిన క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




