– అలా ఆర్డర్లు ఇవ్వని శాఖలపై చర్యలు
– చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 22ః టెస్కో సంస్థకు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వస్త్ర ఆర్డర్లను వారం రోజుల్లో అందించాలని చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ పేర్కొన్నారు. వ్యవసాయ, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆదేశాల మేరకు సచివాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. 2025- 26 సంవత్సరానికి గాను టెస్కోకు అన్ని ప్రభుత్వ శాఖల నుండి వారం రోజులలో తమకు కావలసిన వస్త్ర ఆర్డర్లు ఇవ్వాల్సిందిగా సూచించారు. అదేవిధంగా వివిధ శాఖలు టెస్కోకి బకాయి పడిన నిధులను వెంటనే చెల్లించాలని కోరారు. 2026- 27 సంవత్సరానికి నాలుగు శాఖల నుండి మాత్రమే ఆర్డర్లు వచ్చాయంటూ మిగిలిన శాఖల నుంచి వారం రోజుల్లో ఆర్డర్లు అందించాలని వివిధ శాఖల అధికారులను కోరారు. వస్త్రాల ఇండెంట్‌తోపాటు 50% నిధులను అడ్వాన్సు గా చెల్లిస్తే టెస్కో వస్త్ర ఉత్త్పత్తి ని ప్రారంభించి సకాలంలో సరఫరా చేయగలదని తెలిపారు. ప్రభుత్వ శాఖలకు సకాలంలో వస్త్రాలను ఉత్పత్తి చేసి అందించాలని టెస్కో అధికారులకు సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సంస్థల నుండి వస్త్ర కొనుగోలుకు వంద శాతం ఆర్డర్స్ తీసుకుని చేనేత మరియు పవర్ లూమ్ సంఘాలకు వర్క్ ఆర్డర్ ఇచ్చి నేత కార్మికులకు నిరంతరం పని కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జౌళి శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో స్త్రీ , శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనిత రామచంద్రన్ ,సెర్ప్ సీఈవో దివ్య, సంభందిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





