హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25: రాష్ట్రానికి కేటాయించిన ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారుల ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం డీజీపీ కార్యాలయంలో మంగళవారం జరిగింది. మందారే సోహం సునీల్(2023 బ్యాచ్) రాహుల్ కాంత్(2023బ్యాచ్), అయషా ఫాతిమా(2023 బ్యాచ్) , మనీషా నెహ్ర (2024 బ్యాచ్ )లు డీజీపీ కార్యాలయంలో వివిధ విభాగాలను సందర్శించి అక్కడ పనితీరును తెలుసుకున్నారు. మొదటగా శాంతిభద్రతల అడిషనల్ డిజిపి మహేష్ ఎం భగవత్ ను కలిసి శాంతిభద్రతల పర్యవేక్షించే విధానాన్ని, ఎదుర్కోవాల్సిన అంశాలు గురించి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఆర్గనైజేషన్ సెటప్ గురించి శాంతిభద్రతల ఏఐజి రమణ కుమార్, పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగల గురించి టెక్నికల్ సర్వీసెస్ అడిషనల్ డిజిపి వి.వి.శ్రీనివాసరావు, ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ గురించి ఐజిపి (పి అండ్ ఎల్) ఎం రమేష్, ఆర్గనైజేషన్ కార్యకలాపాలపై అడిషన్ డిజిపి స్వాతి లక్రా, మహిళా భద్రతా విభాగం చర్యల గురించి అడిషనల్ డిజిపి చారుసిన్హా లను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో ఐదు వారాలపాటు శిక్షణ పూర్తి అయిన అనంతరం వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జిల్లాస్థాయి శిక్షణ పొందనున్నారు. మహారాష్ట్ర కు చెందిన మందార సోహం సునీల్ కరీంనగర్ కమిషనరేట్ లోనూ, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాహుల్ కాంత్ అదిలాబాదు జిల్లాలోనూ, మధ్యప్రదేశ్ కు చెందిన ఆయాస ఫాతిమా సిద్దిపేట కమిషనరేట్ లోనూ, రాజస్థాన్ కు చెందిన మనీష్ నెహ్ర ములుగు జిల్లాలో శిక్షణ పొందనున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





