పార్లమెంట్‌ సమావేశాప్ర‌తిప‌క్షాల ఆటంకాలు

– బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ వంటి పార్టీలు సభలో చర్చల్లో పాల్గొనడం కంటే అడ్డంకులు సృష్టించడమే లక్ష్యంగా కుట్రలు చేశాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ విమర్శించారు. అయినప్పటికీ నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలన దృఢత్వంతో సమావేశాలు ఫలవంతం కాగా నిర్ణయించిన సమయానికి మించి సుదీర్ఘమైన చర్చలు జరపడంతో ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా జరిగాయని వివరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ ‘సర్‌’, ఈవీఎం, ఓటు చోరీ వంటి అంశాలను ప్రస్తావించి ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. అయినా కాంగ్రెస్‌ చరిత్రలో జరిగిన తప్పిదాలు బయటపెట్టడంతో చివరికి కాంగ్రెస్‌ పార్టీ బొక్కబోర్లా పడిరదని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల పారదర్శకత, ప్రజాస్వామ్య వ్యవస్థ పునరుద్ధరణలో కేంద్రం తీసుకున్న కృషిని తెలియజేశారు. ప్రజాసమస్యలు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చకు రాకుండా కొన్ని రోజులుగా కాంగ్రెస్‌ పార్టీ కుటిల యత్నాలు చేసిందని విమర్శించారు. ఈసారి ప్రతిపక్షాలు పార్లమెంటరీ విధానాలకు విరుద్ధంగా ఎంత రాద్ధాంతం చేసినా, అల్లరి చేసినా, బిల్లుల ప్రతులు చించేసినా, గోల చేసినా సమావేశాలు చాలా అర్థవంతంగా నిర్వహించామన్నారు. ప్రతిపక్షాలు లేవనెత్తే ఏ అంశాలపైన అయినా చర్చించేందుకు సిద్ధమని ప్రధాని నరేంద్ర మోదీ సమావేశాల మొదట రోజే స్పష్టం చేశారని, అయితే కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష పార్టీలు అర్థంపర్థం అంశాలను తెరమీదకు తీసుకొచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి అమిత్‌ షా నిజానిజాలను స్పష్టంగా, ధీటుగా ప్రస్తావిస్తూ, ప్రజలకు అవగాహన కల్పించారన్నారు. రాహుల్‌ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ వరుసగా మూడుసార్లు ఓడిన తరువాత ఎన్నికల సంఘంపై అనవసర భయాన్ని ప్రేరేపిస్తున్నారని, ఎన్నికల్లో ఓడితే ఈవీఎంల తప్పు.. ఓట్‌ చోరీ.. కాంగ్రెస్‌ గెలిస్తే ఈవీఎంలు బాగానే పనిచేస్తున్నాయని చెప్పడం సిగ్గుచేటు అని అన్నారు. ఇది ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థపై కాంగ్రెస్‌ రాజకీయ ప్రేరిత అభ్యంతరాలను చూపిస్తున్నదన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *