– ఏఐ నూతన ఆవిష్కరణల వేదికగా తెలంగాణ
– రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: కృత్రిమ మేధకు సంబంధించిన నూతన ఆవిష్కరణల వేదికగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం అమెరికా పెట్టుబడిదారులకు అనేక అవకాశాలను కల్పిస్తోందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్-2026లో భాగంగా దేశ రాజధానిలో అమెరికా- ఇండియా వాజిజ్య మండలి(యూఎసఐబీసీ) ప్రతినిధులతో గురువారం జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో ఆయన కీలకోపన్యాసం చేశారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, అత్యున్నత టెక్నాలజీ ఎకోసిస్టం రాష్ట్రంలో నూతన అవకాశాలను సృష్టించిందని శ్రీధర్ బాబు తెలిపారు.అమెరికా టెక్ దిగ్గజాలతో పబ్లిక్ ప్రేవేల్ భాగస్వామ్యాన్ని ఇప్పటికే తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. ముందు చూపుతో కూడిన స్థిరమైన విధానాలు ఏఐ పరిశోధనలకు ఆలంబనగా మారాయని శ్రీధర్‌బాబు వివరించారు. ప్రజా సేవలపై రియల్ టైం పర్యవేక్షణతో కృత్రిమ మేధ వినియోగాన్ని పెంచిన విషయాన్ని వెల్లడించారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, పట్టణాభివృద్ధి వంటి రంగాలపై దృష్టి సారించిన ఇన్నోవేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం తెలంగాణను ఏఐ రంగంలో అగ్రగామిగా నిలబెట్టిందన్నారు. కృత్రమ మేధ ఆవిష్కరణలకు ప్రపంచంలోనే ఒక ముఖ్య కేంద్రంగా నిలబడేలా తెలంగాణాను తీర్చుదిద్దుతున్నామని మంత్రి వెల్లడించారు. వేగంగా దూసుకుపోతున్న టెక్నాలజీ ప్రపంచంతో పోటీపడాలన్నదే తమ సంకల్పమని అన్నారు. ఏఐ యూనివర్సిటీ, ఏఐ హబ్‌ల ఏర్పాటు, ప్రతిభావంతులతో కూడిన స్కిల్ ఫోర్స్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో అత్యంత ప్రాధాన్యతనిస్తామన్నారు. సమావేశంలొ యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ టెక్నాలజీ ఎంగేజ్‌మెంట్ సెంటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జోర్డాన్ క్రెన్ షా, యుఎసఐబిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాకబ్ గులిష్, తెలంగాణా ఐటి అడ్వయిజర్Ù సాయిక్రిష్ణ, ‘మీ సేవ’ కమిషనర్ రవికిరణ్, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





