అవకాశాలు పుష్కలం.. పెట్టుబడులు పెట్టండి

– ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌’లో తెలంగాణ రోల్‌ మోడల్‌
– లాంగ్‌-టర్మ్‌ వాల్యూ క్రియేషన్‌, కో-క్రియేషన్‌కు ప్రాధాన్యం
– ‘అమెరికా-యూటా’ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలోనే ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా నిలిచిన తెలంగాణలో అవకాశాలు పుష్కలమని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికా – యూటా(ఖ్‌aష్ట్ర) పారిశ్రామికవేత్తలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ యూటా ఎండీ, సీవోవో డేవిడ్‌ కార్లెబాగ్‌ నేతృత్వంలోని యూటా పారిశ్రామికవేత్తల బృందం సచివాలయంలో ఆయనను శుక్రవారం ప్రత్యేకంగా కలిసింది. టెక్నాలజీ, ఇన్నోవేషన్‌, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, లైఫ్‌ సైన్సెస్‌, ఏఐ ఆధారిత హెల్త్‌ కేర్‌, క్లీన్‌ ఎనర్జీ, ఎడ్యుకేషన్‌, స్కిల్స్‌ తదితర రంగాల్లో యూటా-తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సహకారం, నైపుణ్య మార్పిడికి గల అవకాశాలపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ కేవలం పెట్టుబడులను ఆకర్షించడమేకాక గ్లోబల్‌ ఎకానమీకి సపోర్ట్‌ ఇచ్చేలా లాంగ్‌-టర్మ్‌ వాల్యూ క్రియేషన్‌కు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తీసుకొచ్చిన సంస్కరణలు, పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ఏయే రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం, పరిశ్రమల ఏర్పాటుకు గల అనుకూలతలు, పారిశ్రామికవేత్తలకిచ్చే ప్రోత్సాహకాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. అనంతరం టీ-హబ్‌, టీ- వర్క్స్‌, వీ హబ్‌లను వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ – యూటా, సిలికాన్‌ స్లోప్స్‌ అండ్‌ యూటా టెక్‌ స్టార్టప్‌లతో అనుసంధానించేలా చొరవ చూపాలని ప్రతినిధి బృందాన్ని ఆయన కోరారు. ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ తదితర కటింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీస్‌లో యూనివర్సిటీ ఆఫ్‌ యూటా, బీవైయూ, న్యూమాంట్‌ యూనివర్సిటీలతో కలిసి రాష్ట్రంలోని ప్రముఖ విద్యా సంస్థలు ఉమ్మడి అకడమిక్‌, రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌ లను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘యూటా’ రాష్ట్రంతో పటిష్ఠమైన, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ ద్వైపాక్షిక సహకారం పెట్టుబడులకే పరిమితం కాకుండా ఇన్నోవేషన్‌, స్కిల్స్‌, టెక్నాలజీ రంగాల్లో ఉమ్మడి ఆవిష్కరణలకు దిక్సూచిగా మారాలని మంత్రి ఆకాంక్షించారు. తెలంగాణ వంటి ఫాస్ట్‌-గ్రోయింగ్‌, డైనమిక్‌, ప్రో-యాక్టివ్‌ రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు ‘యూటా’ సిద్ధంగా ఉందని డేవిడ్‌ కార్లెబాగ్‌ అన్నారు. ద్వైపాక్షిక సహకారం, నైపుణ్య మార్పిడి విషయంలో తెలంగాణతో చురుగ్గా పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో యూటా హౌజ్‌ ఆఫ్‌ రిప్రజంటేటివ్స్‌ జేసన్‌ థాంప్సన్‌, మాట్‌ మాక్‌ఫెర్సన్‌, నికోల్‌ మాక్‌ఫెర్సన్‌, లైఫ్‌ టైం ప్రెసిడెంట్‌ బీజే హాకే, జేకేడీ ప్రెసిడెంట్‌ మైక్‌ నెల్సన్‌, మోనెరె ఏఐ సీఈవో, కో-ఫౌండర్‌ మౌ నంది, భారత్‌ వ్యాలీ అడ్వైజర్లు స్టీవ్‌ వుడ్‌, సున్‌హాష్‌ లోడే, ఎక్విప్‌ సోషల్‌ ఇంపాక్ట్‌ టెక్నాలజీస్‌ ఫౌండర్‌ లక్ష్మీనారాయణ, ఐఐఆర్‌ఎఫ్‌ గురు సౌలే తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *