హర్మూజ్‌ ‌జలసంధిని తెరవండి

-ఇరాన్‌కు 22 దేశాలు విజ్ఞప్తి

న్యూదిల్లీ, మార్చి 21: హర్మూజ్‌ ‌జలసంధిని తెరవాలని ఇరాన్‌కు 22 దేశాలు విజ్ఞప్తి చేశాయి. దాడులు కూడా ఆపాలని కోరాయి. చమురు క్షేత్రాలు, వాణిజ్య నౌకలపై దాడులను ఖండించాయి. ఇరాన్‌ ‌చర్యల వల్ల అన్ని దేశాలపై దుష్ప్రభావం పడుతోందని పేర్కొన్నాయి. ఈమేరకు యూఏఈ, యూకే, ఫ్రాన్స్, ‌జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, ‌జపాన్‌, ‌దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌, ‌డెన్మార్క్, ‌బహ్రెయిన్‌ ‌తదితర దేశాలు సంయుక్త ప్రకటన చేశాయి. గల్ఫ్‌లోని నిరాయుధ వాణిజ్య నౌకలు, చమురు, గ్యాస్‌ ‌కేంద్రాలు సహా పౌర మౌలిక సదుపాయాలపై ఇటీవల ఇరాన్‌ ‌జరిపిన దాడులు, హర్మూజ్‌ ‌జలసంధిని మూసివేయడాన్ని ఖండిస్తున్నాం. సముద్ర చట్టాలకు సంబంధించి ఐరాస ఒప్పందంతో పాటు స్వేచ్ఛాయుత నౌకాయానం అనేది అంతర్జాతీయ చట్టంలో ఓ ప్రాథమిక సూత్రం. ఇరాన్‌ ‌చర్యలు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలపై, ముఖ్యంగా అత్యంత బలహీన వర్గాలపై ప్రభావం పడుతోందని యూఏఈ విదేశాంగ శాఖ ఓ సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ఇందులో 22 దేశాలు సంతకాలు చేశాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *