ఓపెన్‌ ‌స్కూల్‌ ‌టెన్త్, ఇం‌టర్‌ ‌షెడ్యూల్‌ ‌విడుదల

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 21: తెలంగాణ ఓపెన్‌ ‌స్కూల్‌ ‌సొసైటీ  2026 సంవత్సరానికిగానూ 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ ‌పబ్లిక్‌ ‌పరీక్షల టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు ఇప్పుడు పూర్తి షెడ్యూల్‌ను చూసుకోవాలని సూచించింది. షెడ్యూల్‌ను పూర్తిగా తేదీల వారీగా పరిశీలించుకోవాలని పేర్కొన్నది. తాజా టైమ్‌టేబుల్‌ ‌ప్రకారం.. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ‌థియరీ పరీక్షలు ఏప్రిల్‌ 20‌వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి. ఉదయం ఫిప్ట్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం షిప్ట్ ‌మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సాగనుంది. ఆ తర్వాత ఏప్రిల్‌ 28 ‌నుంచి మే 5వ తేదీ వరకు ఇంటర్నల్స్, ‌ప్రాక్టికల్‌ ‌పరీక్షలు జరగనున్నాయి.
——————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *