-బెట్టింగ్ యాప్ ఉచ్చులో పడకండి
-నగర పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ హెచ్చరిక
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7: ఐపీఎల్ మ్యాచ్‌ల పేరుతో ఆన్‌లైన్ బెట్టింగ్ మోసాలు పెరిగి పోతున్నాయని… ఈ ఉచ్చులో పడవద్దని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరిక జారీ చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సీపీ స్పందించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఫేక్ క్రికెట్ ప్రిడిక్షన్ ఛానెల్స్ దందా చేస్తున్నాయని.. టాస్, మ్యాచ్ ఫలితాలు ముందే చెబుతామని అమాయకులను బెట్టింగ్ ఉచ్చులోకి లాగుతూ మోసం చేస్తున్నాయని తెలిపారు. ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా ఈ అసత్య ప్రచారాల్లో పాల్గొంటున్నారని అన్నారు. ఈ ఫేక్ ప్రిడిక్షన్ ఛానెల్స్ ముందుగా ఎన్‌రోల్ చేయించి, తర్వాత బెట్టింగ్ యాప్‌ల లింకులు పంపి మోసం చేస్తున్నాయని సజ్జనార్ అన్నారు. బెట్టింగ్ వల్ల కష్టపడి సంపాదించిన డబ్బును అమాయకులు కోల్పోతున్నారని ఆయన చెప్పారు. ఫేక్ ప్రిడిక్షన్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని సీపీ హెచ్చరించారు. ఫేక్ ప్రిడిక్షన్‌లు, బెట్టింగ్‌లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటుందని సీపీ తెలిపారు. ఇప్పటివరకు 494 పెయిడ్ యాడ్స్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు బ్లాక్ చేశారని సీపీ చెప్పారు. సోషల్ డియాలో 129 ఫేక్ ప్రొఫైళ్లను తొలగించారన్నారు. బెట్టింగ్ యాప్‌లపై నిరంతర నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. మోసపూరిత యాడ్స్ కనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయాలని ప్రజలను సీపీ కోరారు. సైబర్ మోసం జరిగితే వెంటనే 1930కి ఫోన్ చేయాలని లేదా వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.
——————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.