రోజుకు ఒక రూపాయి పోస్టర్ ఆవిష్కరణ

– ఫోటోగ్రాఫర్ కుటుంబాలు ఆర్థికంగా భరోసా

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 26: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం నూతనంగా అందిస్తున్న రోజుకు ఒక రూపాయి ఆర్థిక భరోసా కు సంబంధించిన పోస్టర్ ,బాండ్ ను  అండ్ వీడియో గ్రాఫర్ సంఘం సభ్యులు ఆవిష్కరించారు. ఈ భరోసా వ‌ల్ల యాదాద్రి జిల్లా లో ఫోటో గ్రాఫర్స్ అందరికి ఆర్థిక సహాయం అందుతుంది. తన కుటుంబ సభ్యులకు కూడా సహాయ అందించే దిశాగా నిర్ణయించారు, ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భోగ.చంద్రశేఖర్ , జిల్లా ప్రధాన కార్యదర్శి చిల్లా.హరిరెడ్డి , రాష్ట్ర ఉపాధ్యక్షులు యమల.అప్పల రెడ్డి , జిల్లా గౌరవ అధ్యక్షులు బొమ్మగాని.గణేష్ , జిల్లా ఉపాధ్యక్షులు చాట్లపల్లి.సిద్దు , పందిరి రమేష్ గారు, జిల్లా పీఆర్ ఓ భేతి రవి కుమార్ గారు, రామన్నపేట పీఆర్ ఓ భాషమల్ల సంతోష్ కుమార్, యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కర్రే.శ్యామ్ , ప్రధాన కార్యదర్శి కందోజు.రవి కిరణ్ , భోగ.శేఖర్, సంతోష్, స్వామి నాయక్, యాదగిరిగుట్ట మండల ఫోటోగ్రాఫర్స్ తదితరులు పాల్గొన్నారు,


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *