ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌..

– మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిపిస్తే కేంద్రం నిధులు తెస్తాం
– కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 17: అత్యధిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తమ పార్టీని గెలిపిస్తే కేంద్రం నుండి అధిక నిధులు తెస్తామని, అవసరమైతే సీఎస్సార్‌ నిధులు తెచ్చి బీజేప పాలిత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అభివృద్ధి చేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ హామీ ఇచ్చారు. సికింద్రాబాద్‌లోని క్లాసిక్‌ గార్డెన్‌లో శనివారం జరిగిన బీజేపీ మున్సిపల్‌ ఎన్నికల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ రెండేళ్ల పాలనలో మున్సిపాలిటీలకు ఖర్చు చేసిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే గెలిచిన వాళ్లంతా మళ్లీ కాంగ్రెస్‌ గూటికే వెళ్తారన్నారు. కరీంనగర్‌, నిజామాబాద్‌, బైంసా, నిర్మల్‌లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌తో మజ్లిస్‌ దోస్తీ ఉందని, బీజేపీ గెలిచేచోట ఓట్లను తారుమారు చేసి మజ్లిస్‌కు అధిక సీట్లు వచ్చేలా డీలిమిటేషన్‌ పేరుతో కాంగ్రెస్‌ కుట్ర చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్‌, మజ్లిస్‌, బీఆర్‌ఎస్‌ కుట్రలను చిత్తు చేస్తామన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పైసలను నమ్ముకుని గెలవాలనుకుంటున్నాయంటూ బీజేపీ ప్రజలను నమ్ముకుని ఎన్నికల్లోకి వెళుతోందని అన్నారు. అభివృద్ది, ప్రజా సమస్యలు, హిందుత్వం.. ఈ మూడు అంశాలే బీజేపీ ఎన్నికల ఎజెండా అని, ఇక నుండి పోలింగ్‌ జరిగే వరకు ఒక్కో ఇంటికి ఆరుసార్లు వెళ్లండి.. వార్డుల వారీగా సమస్యలున్న చోటకే వెళ్లి భరోసా ఇవ్వండి అని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *