బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టాలి

` రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పిలుపు
– బీజేపీ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ కమిటీ సమావేశం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: రానున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బీజేపీ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు సమావేశానికి అధ్యక్షత వహించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోపాటు, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను, ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రామచందర్‌ రావు కమిటీ సభ్యులకు సూచించారు. ఈ సమావేశంలో ఎంపీ రఘునందన్‌ రావు, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ గౌతంరావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్‌రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *