20న గచ్చిబౌలి స్టేడియంలో సీఎం కప్-2026

– ప్రారంభ కార్యక్రమానికి సీఎం రేవంత్ కు ఆహ్వానం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల‌ 20న ప్రారంభంకానున్న సీఎం కప్-2026 కార్యక్రమానికి హాజరుకావాలని ముఖ్యమంత్రి  అనుముల రేవంత్ రెడ్డిని పశుసంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనరెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఓఆ సోనిబాలాదేవి లు ఆహ్వానించారు. రాష్ట్రంలోని పల్లె నుంచి పట్నం వరకు విద్యార్థులు, యువతీ, యువకుల్లో దాగి ఉన్న‌ క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం సీఎం కప్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మొత్తం 44 రకాల క్రీడలను సీఎం కప్లో భాగంగా పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కీడలల్లో పాల్గొనడం వల్ల పోటీతత్వంతో శారీరక దృఢత్వం మెరుగుపడుతుందని మంత్రి వాకిటి శ్రీహరి అభిప్రాయపడ్డారు. సీఎం కప్ను పాఠశాల విద్యనుంచి యూనివర్శిటీ స్థాయి విద్యార్థుల వరకు సద్వినియోగం చేసుకోవాలని  కోరారు.

గ్రామీణ క్రీడా రంగానికి సాంకేతిక హంగులు : భట్టి విక్రమార్క

తెలంగాణ గ్రామీణ క్రీడా రంగానికి ప్రోత్సాహం ఇచ్చే లక్ష్యంతో నిర్వహిస్తున్న రెండో విడత సీఎం కప్ 2025-26కు సాంకేతిక హంగులు సమకూర్చి క్రీడాకారులకు ఇష్టమైన సమాచార వ్యవస్థ ఏర్పాటు చేయడం సంతోషకరమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సెక్రటేరియట్‌లో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండో విడత ్పువీఃs cuజూ GAవీజుS, ్పువీఃs ్పుuజూ: GAవీజుS – Aస్త్రవఅtఱc AI caశ్రీశ్రీ cవఅtతీవAజూజూ : చీఱశ్రీaఎaఅఱని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండి డాక్టర్ సోని బాలాదేవిలతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడా రంగానికి పెద్ద పీట వేసే లక్ష్యంతో మట్టిలో మాణిక్యాలను గుర్తించే విధంగా క్రీడా శాఖ సీఎం కప్ నిర్వహించడం అభినందనీయమన్నారు. యువకులు, విద్యార్థులు వ్యసనాల బారిన పడకుండా మైదానాలకు తరలి రావాలన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు నిర్వహిస్తున్న ఈ పోటీల్లో దాదాపు నాలుగున్నర లక్షల మంది క్రీడాకారులు గ్రామీణ, మండల, అసెంబ్లీ, జిల్లా స్థాయిలో పాల్గొశ్రీఞవ అందులోంచి 22,000 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం హర్షణీయమని అన్నారు. క్రీడాకారులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేసే విధంగా సీఎం కప్ గేమ్స్ పేరిట నీలమణి యాప్ ద్వారా ఏఐ కాల్ సెంటర్ ద్వారా 24 గంటల సమాచారాన్ని క్రీడాకారులకు అందుబాటులో ఉంచడం అభినందనీయమని అన్నారు. 44 క్రీడాంశాలు 12 జిల్లాల వ్యాప్తంగా జరుగుతున్న ఈ పోటీలు విజయవంతం కావాలని, ఈ క్రీడలనుంచి మంచి ఛాంపియన్లు వృద్ధిలోకి రావాలని ఆయన అభిలాషించారు. ఈ కార్యక్రమంలో క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు పాల్గొన్నారు.

 


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *