– ఆర్చరీ ఛాంపియన్ చికితకు సీఎం హామీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8: ఒలింపిక్స్‌లో పతకం సాధించేలా ప్రభుత్వం తరపున పూర్తిస్థాయి శిక్షణ అందించేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళా ఆర్చరీ ఛాంపియన్ చికిత తనిపర్తికి హామీ ఇచ్చారు. సోమవారం ముఖ్యమంత్రిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. కెనడాలో ఇటీవల జరిగిన 2025 యూత్ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం తరపున బంగారు పతకం గెలుచుకున్న తొలి మహిళగా రికార్డు చికిత సృష్టించిన సంగతి విదితమే. ఈ సందర్భంగా ఆమెను సీఎం అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయరమణారావు, శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, రాజేందర్ రావు, తదితరులు ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





