– టిఎస్ఎల్ పిఆర్ బి చైర్మన్ శ్రీనివాసరావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్ ఆర్ టి సి)లో ఖాళీగా ఉన్న ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (టిఎస్టి), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (ఎంఎస్ టి) పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థులకు రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టిఎస్ఎల్ పిఆర్ బి) కీలక ఊరటనిచ్చింది. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షా విధానంపై అవగాహన పెంచుకునేందుకు వీలుగా, గతంలో నిర్వహించిన రాత పరీక్షలకు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలను మండలి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ మేరకు టి ఎస్ ఎల్ పి ఆర్ బి చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 29వ తేదీన (ఆదివారం) రెండు విడతల్లో ఈ రాత పరీక్షలు జరగనున్న నేపథ్యంలో, అభ్యర్థుల సౌకర్యార్థం పాత ప్రశ్నపత్రాలను పీడీఎఫ్ రూపంలో వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది జనవరి 21న విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని, అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని సన్నద్ధం కావాలని చైర్మన్ సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు మండలి అధికారిక వెబ్‌సైట్ www.tgprb.in సందర్శిం చి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. పరీక్షలు మార్చి 29న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించనున్నామని తెలియజేశారు.
———————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



