హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1: హైదరాబాద్ లోని పాతబస్తీ వాసులకు ప్రభు త్వం శుభవార్త చెప్పింది. ఓల్డ్ సిటీ మెట్రో రైల్వే కనెక్టివిటీ పనులకు తెలంగాణ ప్రభు త్వం మరొక కీలక అడుగు వేసింది. 2025-26 ఆర్ధిక సంవత్సర బడ్జెట్లో భాగంగా ‘మె ట్రో కనెక్టివిటీ టూ ఓల్డ్ సిటీ’ పథకం కింద రూ.125 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసిం ది. ఈ మేరకు మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ (బడ్జెట్) శాఖ సోమవా రం జీఓ జారీ చేసింది. ఆదేశాల ప్రకారం.. మంజూరైన ఈ నిధులను సంబంధిత బడ్జెట్ ప్రొవిజన్ నుంచి రిలీజ్ కానుంది. విడుదలైన మొత్తాన్ని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఖాతాకు మళ్లించేందుకు ట్రెజరీ శా ఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




