పొద్దున వాకిట్లో
పువ్వు తెల్లగా నవ్వితే
నువు గుర్తొస్తావు
తలుపు తీసినప్పుడు
అదాటున పిల్లతెమ్మెర తోసుకొస్తే
నువు గుర్తొస్తావు
అమ్మ భుజం మీద వెనుతిరిగి
పాప చేతులూపినపుడు
నువు గుర్తొస్తావు
వానాకాలం చినుకుల్లో
వెచ్చని అరచేతుల తేనీటి ఆవిరుల మధ్య
నువ్వు గుర్తొస్తావు
ఎవరూ లేని రోడ్డు మీద
ఒక్కణ్ణీ నడచి వెళుతున్నప్పుడు
నువు గుర్తొస్తావు
చలిరాత్రి రగ్గులో
చేతులు రుద్దుకొని చెంపలకాన్చినపుడు
నువు గుర్తొస్తావు
రేయి కలల నిండా
కురుల పరిమళంతో కప్పేసి
మోహధూపంలో ముంచేసి
మెడ వంపున ఖైదు చేసి
నువ్వే గుర్తొస్తావు
నువ్వే గుర్తొస్తావు
నువ్వే గుర్తొస్తావు
-పి శ్రీనివాస్ గౌడ్





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల