– సముద్ర జీవులపై తీవ్ర ప్రభావం
మెక్సికో, మార్చి 27: గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో 600 కి.మీ మేర భారీ స్థాయిలో చమురు తెట్టు ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. చమురు తెట్టు విస్తరించి సముద్ర జీవ వైవిధ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు మెక్సికో అధికారులు వెల్లడించారు. దీనివల్ల ఏడు ప్రకృతి సంరక్షణ ప్రాంతాలు సహా సముద్రంలోని జీవరాశులపై పెను ప్రభావం పడిందన్నారు. రెండు సహజ చమురు ఊటలు, ఓ చమురు నౌక సముద్రంలో బోల్తాపడడం వల్ల ఈ ముప్ప్పు సంభవించిందన్నారు. కొన్ని నెలల క్రితం భారీ వర్షాలు, వరదల కారణంగా మెక్సికోలోని వెరాక్రూజ్ ప్రాంతంలో సహజంగా చమురు బయటకు వచ్చే పైప్‌లైన్ దెబ్బతింది. దీంతో లీకైన చమురు నదుల ద్వారా సముద్రంలోకి చేరి సుమారు 200 కి.మీ తీరప్రాంతాన్ని దాటి మొత్తం 600 కి.మీ వరకు వ్యాపించింది. అదనంగా కాంపెచే బేలోని మరో సహజ చమురు ఊట కూడా నిరంతరం లీక్ అవుతూ కాలుష్యాన్ని మరింత పెంచుతోంది. ఇంకా మూడు నెలల క్రితం సముద్రంలో ఒక చమురు నౌక మునిగిపోవడం వల్ల పరిస్థితి మరింత విషమించింది. ఈ ఘటనల వల్ల సముద్రంలోని చేపలు, సముద్ర తాబేళ్లు వంటి జలచరాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. అలాగే, ప్రకృతి సంరక్షణ ప్రాంతాలు, బయోస్పియర్ రిజర్వులు, జాతీయ పార్కులు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రస్తుతం కాలుష్యాన్ని నియంత్రించేందుకు అధికారులు, సిబ్బంది శుభ్రపరిచే చర్యలు చేపడుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





