– ప్రధాని నిర్ణయంపై రామచందర్ రావు హర్షం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27: భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు అందించిన తీపి కబురు పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ సామాన్య, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలే పరమావధిగా కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించడం ఒక సాహసోపేతమైన, జనరంజకమైన నిర్ణయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని ఏకంగా ‘సున్నా’ (0) స్థాయికి తగ్గించడం మోదీ పరిపాలనా దక్షతకు నిదర్శనమని కొనియాడారు. పెట్రోల్‌పై కూడా రూ.10 మేర భారాన్ని తగ్గించి కేంద్రం తన బాధ్యతను చాటుకుందని, మరి ఇప్పుడు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన బాధ్యతను ఎప్పుడు నెరవేరుస్తుంది అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాట్ సుమారు 35% ఉండటం వల్ల సామాన్యుడిపై పెను భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం పన్నులు తగ్గిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోందని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమన్నారు. గత ప్రభుత్వాలు చేసిన అప్పులు, ఆయిల్ బాండ్ల భారం ఉన్నా కేంద్రం వెనక్కి తగ్గలేదని, కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం పన్నుల రూపంలో ప్రజల రక్తాన్ని పిండుతోందని అన్నారు. పెట్రోల్ ధరలో కేంద్రం వాటా కంటే రాష్ట్రం వాటాయే ఎక్కువగా ఉండటం అత్యంత దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా మాటల గారడీలు పక్కన పెట్టి తక్షణమే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలిలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన పన్ను వాటాను తగ్గిస్తేనే పెట్రోల్ ధర రూ.100 లోపనకు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





