- రైతులు దండిగా సాగు చేయాలి
– నర్మెట్ల ఆయిల్ పామ్ సందర్శించిన మంత్రులు
– 22న సిఎం చేతుల మీదుగా ప్రారంభం
– వెల్లడించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
సిద్దిపేట, ప్రజాతంత్ర, మార్చి 14: రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషిచేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులకు పెట్టుబడి, ఎరువులు అన్నీ అందిస్తున్నామని తెలిపారు. తాను మంత్రిగా వచ్చిన సమయానికి ఆయిల్ పామ్ టన్ను రూ.12వేలు ఉండేదని, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రూ.20 వేలకు పైగా పెంచామని చెప్పారు. ఈనెల 22న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న సిద్దిపేట జిల్లా నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ రైతులు ధైర్యంగా ఆయిల్ పామ్ పంట వేయాలని సూచించారు. ఈ పంటకు నీటి సమస్య, మార్కెట్ సమస్య లేదన్నారు. అన్ని విధాలా రైతులకు లాభాలు ఇచ్చే పంట అని చెప్పారు. నర్మెట్టలో త్వరలో రైతు మేళా నిర్వహిస్తామన్నారు. రైతులు క్రాప్ డైవర్షన్‌కు రావాలని లేకపోతే రైతులకు నష్టం జరుగుతుందన్నారు. తెలంగాణకు సిద్దిపేట కేంద్రంగా ఉంటుంది.. అందుకే ఇక్కడ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం మొదలుపెట్టాం. ఇక్కడ రూ.40 కోట్లతో రిఫైరీ ఆయిల్ యూనిట్ కూడా ప్రారంభిస్తాం. రైతులు పండించిన వేస్టెజ్ గెలలతో విద్యుత్ తయారు చేస్తాం. కేంద్రం ధాన్యం కొనబోమని చెబుతోంది. రబీలో కూడా అత్యధికంగా మనమే వరి పండిస్తున్నాం. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉండటంతో ఎక్కువ సాగు చేస్తున్నారు. నా వరి పొలంలో కూడా ఆయిల్ పామ్ సాగు చేస్తున్నా. ఇక్కడ ఉన్న బాలకృష్ణ దళిత రైతు ధైర్యంతో ఆయిల్ పామ్ సాగు చేసి లాభాలు పొందుతున్నారు ప్రతి రైతు ఆయిల్ ఫామ్ సాగు చేయాలి.. సాగు కావాల్సిన అన్ని సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది. రైతులను కష్టాల నుంచి తప్పించాలన్న, గ్రామాలు పచ్చగా ఉండాలన్నా హార్టికల్చర్ క్రాప్స్ వేయాలి. నేను నా సొంత పొలంలో వక్క సాగు చేస్తున్న.. ఆయిల్ పామ్ సాగులో ఇంటర్ క్రాప్ పంటలకు కూడా సబ్సిడీ ఇస్తాం. 30 జిల్లాలో పామ్ ఆయిల్ ప్లాంటేషన్ జరుగుతుంది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేని పంట పామ్ ఆయిల్ . అన్ని జిల్లాల రైతులను ఇక్కడికి పిలుస్తాం. వారికి కావాల్సిన స్టాల్స్ అన్ని పెడతాం అని అన్నారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ గుజరాత్ వెళ్లినప్పుడు అక్కడ పాల సేకరణ గ్రామీణ స్థాయి నుండి జరుగుతుంది.. అక్కడ అమూల్ పాలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. ఇక్కడ ఆయిల్ పామ్ ఆయిల్ తుమ్మల నాగేశ్వరరావు స్టార్ట్ చేశారు. ప్రతి జిల్లాకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభించాలని భావిస్తున్నాం. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ గతంలో ప్రతిపాదనలు జరిగినప్పటికీ 300 కోట్లు కేటాయించి తుమ్మల పనులు పూర్తి చేయించారు. ఈ ప్రాంత రైతాంగానికి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్రాంత రైతులు ఆయిల్‌పామ్ పై దృష్టి సారించాలి.. మా ప్రాంతంలో ఆయిల్‌పామ్ పండదు అనే అపోహ నుండి తుమ్మల బయటకు తీసుకొచ్చారు. ఇక్కడి రైతులు ఆయిల్‌పామ్ పై ఆసక్తి చూపుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా రైతులు ఆయిల్‌పామ్ సాగు చేయాలనీ ఈ ప్రాంత రైతులను కోరుతున్నా అని పొన్నం అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





