– బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: మేడారం సమ్మక్క-సారక్క జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అధికారిక సెలవు ప్రకటించకపోవడం అన్యాయమని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్ నేనావత్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతి గడించిందని తెలిపారు. కోట్లాదిమంది గిరిజనుల ఆరాధ్య దైవాలు సమ్మక్క-సారక్క పవిత్రమైన మహా జాతరకు సెలవు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం గిరిజనుల ఆత్మగౌరవాన్ని తుంగలో తొక్కడమేనని విమర్శించారు. ఇతర మతపరమైన ఉత్సవాలకు సెలవులు ప్రకటించే ప్రభుత్వం దేశ విదేశాల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలివచ్చే మేడారం జాతరకు మాత్రం సెలవు ఇవ్వకపోవడం తీవ్ర వివక్షకు నిదర్శనమని పేర్కొన్నారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాల పట్ల ప్రభుత్వానికి గౌరవం లేదని స్పష్టంగా చాటిచెప్పుతోందన్నారు. మేడారం జాతరకు సెలవు ప్రకటించకపోవడం అంటే గిరిజన సమాజాన్ని రెండో తరగతి పౌరులుగా చూస్తున్నట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అధికారిక సెలవు ప్రకటించాలని, గిరిజనుల విశ్వాసం, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని రవినాయక్ డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





