ప్రేమ పిచ్చితో నర్సు కిరాతకం

– మత్తు ఇంజక్షన్ తో కన్నవారిని కడతేర్చిన వైనం 
– వివ‌రాలు తెలిపిన వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి

వికారాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులే తన ప్రేమకు అడ్డు వస్తున్నారని భావించిన ఓ కూతురు కసాయిగా మారింది. ప్రాణాలు కాపాడాల్సిన వృత్తిలో ఉండి తన చేతులతోనే కన్నవారిని కడ తేర్చింది. మత్తు ఇంజక్షన్ను మృత్యుపాశంగా మార్చి నిద్రలోనే వారిని అనంతలోకాలకు పం పింది. వికారాబాద్ జిల్లాలో సంచలనం సృ ష్టించిన ఈ దారుణ హత్య ఉదంతం ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. బుధవారం వికారా బాద్ జిల్లా కేంద్రంలోని డిఎస్పీ కార్యాల యం లో డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. వికారాబాద్ జిల్లా బంటారం మండలం యాచారం గ్రామానికి చెందిన నక్కలి దశరథ్ లక్షి దంపతుల కు మార్తె సురేఖ సంగారెడ్డిలో నర్సుగా పనిచేస్తుం ది అన్నారు. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ యువకుడితో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయిన సురేఖ వారి పెళ్లికి తల్లిదండ్రులు ససేమిరా అనడంతో వారిపై కక్ష పెంచుకొని వారిని అడ్డు తొలగించుకోవాలని పథకం వేసి తాను పనిచేస్తున్న ఆసుపత్రి నుండి అత్యంత ప్రమాదకరమైన ‘అట్రాక్యూరియం’ ఇంజక్షన్ల ను దొంగిలించి సెలవుపై ఇంటికి వచ్చిన సురేఖ తల్లిదండ్రుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఒళ్లు నొప్పులు తగ్గుతాయి మంచి నిద్ర పడుతుంది అని నమ్మబలికి వారికి ఆ మత్తు ఇంజక్షన్లను ఇచ్చింది. నర్సు కదా అని నమ్మిన ఆ తల్లిదండ్రులు ఆసూదిమందే తమ పాలిట మృత్యువని ఊహించలేకపోయారు. నిమిషాల వ్యవధిలోనే వారు నిద్రలోనే ప్రాణా లు కోల్పోయినట్లు విచారణలో తేలిం దన్నారు. నిందితురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా అసలు నిజం బయటపడింది అని డీఎస్పీ తెలిపారు


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *