కిట్స్‌ డబ్ల్యులో ఘనంగా ఎన్‌ఎస్‌ఎస్‌ డే  

వరంగల్‌, ప్రజాతంత్ర, సెస్టెంబర్‌ 25: జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) ప్రారంభమై 51 సంవత్సరాలు అయిన సందర్భంగా కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌, వరంగల్‌ (కిట్స్‌డబ్ల్యు)లోని స్టూడెంట్‌ యాక్టివిటీ సెంటర్‌ ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్‌ డేను వలంటీర్లు ఘనంగా జరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా జిల్లా యువజన అధికారి సిహెచ్‌.అన్వేష్‌ మాట్లాడుతూ వివిధ ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్లు గమనించిన 2025 ముఖ్య ఇతివృత్తాలలో యూత్‌ ఫర్‌ డిజిటల్‌ ఇండియా, యూత్‌ ఫర్‌ మై భారత్‌, యూత్‌ ఫర్‌ డిజిటల్‌ లైఫ్‌ ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ పితామహుడు డాక్టర్‌ వీకేఆర్‌వీ రావు 1969 సెప్టెంబర్‌ 24న అధికారికంగా ప్రారంభించారని తెలిపారు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 24న సమాజ సంబంధిత కార్యక్రమాలతో ఎన్‌ఎస్‌ఎస్‌ దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు చెప్పారు. ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.అశోక రెడ్డి మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎస్‌ కేంద్ర లక్ష్యం సమాజాల మధ్య అంతరాన్ని తగ్గించడం చుట్టూ తిరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారు. కిట్స్‌ వరంగల్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ 40 సంవత్సరాల సేవలను విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పారు.  ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్ల ఉత్సాహభరితమైన సామాజిక సేవలు, వారి సాంకేతిక వినూత్న కార్యకలాపాలను ప్రశంసించారు. కార్యక్రమంలో కిట్స్‌డబ్ల్యు డీన్‌ స్టూడెంట్‌ ఎఫైర్స్‌ ప్రొఫెసర్‌ ఎం.శ్రీలత, వివిధ విభాగాల డీన్లు, హెడ్స్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సిహెచ్‌.సతీష్‌చంద్ర, ఎన్‌ఎస్‌ఎస్‌ కో-ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ సంతోష్‌ భార్గవి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పీఆర్వో డాక్టర్‌ డి.ప్రభాకరాచారి, అధ్యాపకులు, సిబ్బంది, స్టూడెంట్‌ కోఆర్డినేటర్‌ ఎన్‌.శివ దీపక్‌, ఆర్‌.వాత్సల్య, జాయింట్‌ సెక్రటరీ ఎం.శ్రీజనితోపాటు 130 మందికిపైగా ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *