అటెన్షన్‌ ‌డైవర్షన్‌ ‌స్కీమ్‌

‌-కేటీఆర్‌కు నోటీసులపై బీఆర్‌ఎస్‌ ‌నేతల ఆగ్రహం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 22: కెటిఆర్‌కు సిట్‌ ‌నోటీసులపై బిఆర్‌ఎస్‌ ‌నేతలు మండిపడ్డారు. ఇదంతా కేవలం డైవర్షన్‌ ‌స్కీమ్‌ అం‌టూ విమర్శలు గుప్పించారు.  బొగ్గు స్కామ్‌పై సమాధానం చెప్పలేక .. నిన్న త‌న‌కు, ఇవాళ కేటీఆర్‌కు సిట్‌ ‌నోటీసులు ఇచ్చారని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్ని నోటీసులు ఇచ్చినా.. ఆరు గ్యారెంటీలు, 420 హాలు అమలు చేసే వరకు వెంట పడుతూనే ఉంటామన్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా.. ఎన్ని అటెన్షన్‌ ‌డైవర్షన్లు చేసినా సీఎం ను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. బామ్మర్ది బాగోతం బయటపెట్టడంతో ఈ నోటీసులు ఇస్తున్నారని అన్నారు. రెండేళ్ల క్రితం నుంచి సడీచప్పుడు లేకుండా ఇప్పుడే నోటీసులు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో ప్రజలకు తెలుసన్నారు. ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కేటీఆర్‌కు సిట్‌ ‌నోటీసులు కాంగ్రెస్‌ ‌సర్కారు నాటకమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు.పాలన గాలికి వదిలి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నాలు ఇవి. రాష్ట్రంలో యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని ప్రజల కర్మానికి వొదిలేసి దావోస్‌, అమెరికా పర్యటన పెట్టుకున్నారు. సర్కారు డబ్బుతో జల్సాలు చేస్తున్నారు. ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో పసలేదని న్యాయస్థానాలు తేల్చి చెప్పినా.. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం మొగలి రేకులు సీరియల్‌ ‌నడిపిస్తోంది. రేవంత్‌రెడ్డి విదేశాల్లో విహరిస్తూ అక్కడి నుంచి వచ్చే వరకు ఈ సీరియల్‌ ‌నడిచేలా ప్లాన్‌ ‌చేసినట్లు అనిపిస్తోంది. రెండేళ్ల కాంగ్రెస్‌ ‌పాలనలో అన్ని ప్రభుత్వ శాఖల వెన్ను విరిచారు. ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో బీఆర్‌ఎస్‌ ‌నేతలకు నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదమ‌ని నిరంజన్‌రెడ్డి అన్నారు. రెండేళ్ల క్రితం నమోదైన కేసులో కేటీఆర్‌కు సిట్‌ ‌నోటీసులు ఇచ్చిందని బీఆర్‌ఎస్‌ ‌నేత సోమా భరత్‌ ‌విమర్శించారు. ‘నోటీసు ఇచ్చి .. విచారణకు వొచ్చేందుకు కనీసం 24 గంటల సమయం కూడా ఇవ్వలేదు. రెండ్రోజుల క్రితం మరో సీనియర్‌నేత హరీష్‌ ‌రావుకు నోటీసులు ఇచ్చారు. కేవలం ప్రశ్నిస్తున్న పార్టీ లక్ష్యంగానే నోటీసులు ఇస్తున్నారు. సిట్‌ ఎం‌దుకు వేశారో కూడా తెలియదు. ఒక పద్ధతి లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కాంగ్రెస్‌ అ‌క్రమాలను బయటపెడుతుంటే నోటీసులు ఇస్తున్నారు. విచారణకు కేటీఆర్‌తో పాటు న్యాయవాదిని అనుమతించాలని కోరాం. సాక్షిగా విచారణ చేసినప్పుడు న్యాయవాదిని అనుమతించబోమని ఏసీపీ చెప్పారని భరత్‌ ‌తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *