ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో మరో పరిణామం

– బీఆర్‌ఎస్‌ ‌మాజీ ఎంపి సంతోష్‌కు సిట్‌ ‌నోటీసులు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి26: సంచలనం సృష్టించిన ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసు దర్యాప్తులో భాగంగా సిట్‌ అధికారులు తాజాగా బీఆర్‌ఎస్‌ ‌మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ ‌రావుకు నోటీసులు జారీ చేశారు. పంజాగుట్ట పోలీస్‌ ‌స్టేషన్‌లో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా, ఈ వ్యవహారానికి సంబంధించిన కొన్ని కీలక వాస్తవాలు సంతోష్‌ ‌రావుకు తెలిసి ఉండవచ్చని భావిస్తున్నట్లు పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, విచారణ నిమిత్తం జనవరి 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జుబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో స్వయంగా హాజరు కావాలని జుబ్లీహిల్స్ ‌విభాగం అసిస్టెంట్‌ ‌కమిషనర్‌ ఆఫ్‌ ‌పోలీస్‌ ‌పి. వెంకటగిరి ఆదేశించారు. ఇప్పటికే ఈ ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో సిట్‌ అధికారులు మాజీ మంత్రులు కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావులను విచారించిన సంగతి తెలిసిందే. ఐటీ చట్టం, ప్రభుత్వ ఆస్తుల నష్టం నిరోధక చట్టం వంటి కఠిన సెక్షన్ల కింద కొనసాగుతున్న ఈ విచారణలో సంతోష్‌ ‌రావుకు నోటీసులు అందడం రాజకీయ వర్గాల్లో పెను కలకలం రేపుతోంది. రేపు మధ్యాహ్నం జరగబోయే ఈ విచారణలో సిట్‌ అధికారులు సంతోష్‌ ‌రావు నుండి ఎటువంటి సమాచారాన్ని రాబడతారనే అంశంపై ఇప్పుడు హాట్‌ ‌టాపిక్‌ ‌గా మారింది.

సంబంధం లేని ప్రతిపక్ష నాయకులను పిలుస్తున్నారు

మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌కి సిట్ నోటీసులు జారీ చేయడాన్ని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఈ విచారణ ప్రక్రియ మొత్తం ఒక అట్టర్ ప్లాప్.. టీవీ సీరియల్‌ను తలపిస్తోందని, అసలైన బాధ్యులైన అధికారులను వదిలేసి, కేసుతో ఎలాంటి సంబంధం లేని ప్రతిపక్ష నాయకులకు వరుసగా విచారణకు పిలవడం కేవలం రాజకీయ కక్షసాధింపు, అటెన్షన్ డైవర్షన్‌లో భాగమేనని విమర్శించారు. భారీ అవినీతి, కుంభకోణాల నుండి, మున్సిపల్ ఎన్నికల ముందు ప్రజల సమస్యల నుంచి దృష్టి మరల్చడం కోసమే ఈ కేసు విచారణ డ్రామాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదన్నారు. హరీష్ రావుని, తనను కూడా ఇదే కేసు పేరుతో విచారించినా ఏమీ సాధించలేకపోయారని, ఇప్పుడు సంతోష్ కుమార్‌ని లక్ష్యంగా చేసుకున్నారని దుయ్యబట్టారు. బొగ్గు కుంభకోణంపై రేపు రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు వినతిపత్రం ఇస్తామని తాము ప్రకటించిన వెంటనే సంతోష్‌కి నోటీసులు రావడం యాదృచ్ఛికం కాదని, ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన అటెన్షన్ డైవర్షన్ అని కేటీఆర్ అన్నారు. సంతోష్ కుమార్‌కు పార్టీ అండగా ఉంటుందని, న్యాయస్థానాల్లో ఈ అక్రమ కేసులను ఎదుర్కొంటామని కేటీఆర్ తెలిపారు

 


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *