ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు

– 4న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 29న సమ్మక్క సారక్క జాతర దగ్గర జరిగిన గొడవలో కరీంనగర్ కమిషనర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును సీఐడీకి అప్పగించడంతో ఏప్రిల్ 4న హైదరాబాద్ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. హుజురాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నం.30/2026 నమోదైంది. సమ్మక్క సారక్క జాతర సమయంలో రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించారని, ప్రజలకు అసౌకర్యం కలిగించారని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, పోలీస్ అధికారులపై అవమానకర వ్యాఖ్యలు చేశారని కౌశిక్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించినట్టు కేసు నమోదైంది. ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏప్రిల్ 4న ఉదయం 11:30 గంటలకు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు. గుర్తింపు పత్రాలు, సంబంధిత డాక్యుమెంట్లు తీసుకురావాలని.. విచారణకు సహకరించాలని కోరారు. సాక్ష్యాలను చెడగొట్టవద్దని హెచ్చరించారు. నోటీసును పట్టించుకోకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *