– నిట్ వరంగల్ ప్రొఫెసర్ కృష్ణానంద
=హసన్‌పర్తి, ప్రజాతంత్ర, నవంబర్ 21: ప్రకృతిలోని ప్రతి అభివృద్ధికి శాస్త్రం పునాది అని, శాస్త్రం లేకుండా ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ ఏదీ ఉనికిలోకి రావని ఎన్‌ఐటీ వరంగల్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఎల్.కృష్ణానంద పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండలస్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ హసన్‌పర్తిలోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్‌లో శుక్రవారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ పరిశీలన, పరిశోధనల ద్వారా ప్రకృతిని వ్యవస్థీకృతంగా అధ్యయనం చేయడం, కొత్త ఆలోచనలతో జ్ఞానాన్ని కనుగొనడమే శాస్త్రం ప్రధాన లక్ష్యమన్నారు. టెక్నాలజీ శాస్త్రీయ పరిశోధనలకు కొత్త మార్గాలు సృష్టిస్తుందని, జాతి అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. గౌరవ అతిథి, కిట్స్ వరంగల్ కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్, ఫిజికల్ సైన్సెస్ విభాగం, జేవివి జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు డాక్టర్ డి.ప్రభాకరాచారి మాట్లాడుతూ భారత్ శాస్త్రీయ ప్రగతిలో స్వదేశీ ఆవిష్కరణలు కీలకమని వెల్లడిరచారు. దేశాభివృద్ధికి, భవిష్యత్ తరాల శ్రేయస్సుకు దోహదపడే స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాలను విద్యార్థులు అవలంబించాలి, అమలు చేయాలని పిలుపునిచ్చారు. మండల విద్యాధికారి ఎ.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సమాజ ప్రయోజనం కోసం సాంకేతికత అనేది శాస్త్ర జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే ప్రక్రియ అని చెప్పారు. అధ్యక్షత వహించిన జేవీవీ మండల అధ్యక్షుడు డాక్టర్ ఎం.సారంగపాణి మాట్లాడుతూ విద్యార్థులు మెరుగైన జ్ఞానం, నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి పుస్తకాలకు ప్రాధాన్యమివ్వాలని, మొబైల్ వాడకాన్ని తగ్గించాలని ఉద్బోధించారు. ప్రిన్సిపాల్ కె.ఇందుమతి, ఉపాధ్యాయులు కె.రాజగోపాల్, వి.లీలావతి, జి.అరుణ్‌కుమార్, కె.రాజకుమారి, డైనమిక్ ఉపాధ్యాయులు, జేవీవీ కార్యదర్శులు, కార్యనిర్వాహక సభ్యులు, ఈవెంట్ కోఆర్డినేటర్ ఎన్.నాగరాజు, విద్యార్థి నాయకులు, ఉపాధ్యాయులు, 70 పాఠశాలలకు చెందిన 180మంది విద్యార్థులు, 20మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





