ఇది ప్రజా సంక్షేమ బడ్జెట్ కాదు.. అభివృద్ధి సమాధి బడ్జెట్..!!

“ప్రభుత్వం బడ్జెట్ లో అంకెల గరాడీ ఎలా ఉందో రాష్ట్రంలో పెట్టుబడుల ముచ్చట అలాగే ఉంది.. భారత్ సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్, మిస్ వరల్డ్ పోటీలు, దావోస్ లండన్ అమెరికా పర్యటనలతో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని కాంగ్రెస్ చెపుతుంది.. అందులో వాస్తవం ఏంటో ప్రభుత్వ ఐటీ అండ్ తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చెబుతుంది.. కంపెనీలు రావడం లేదని, పెట్టుబడులు తగ్గాయాని అధికార వెబ్ సైట్లలో నివేదికలు చెబుతున్నాయి.”

మార్చి 20న తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు..మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ పెట్టారు.. బడ్జెట్ అంటేనే అంకెల గరాడీ..అధికార గారడీ..పండితులకు తప్ప ఆ లెక్కలు పేద మధ్యతరగతి ప్రజలకు అర్థం కాదు.. ప్రభుత్వం పెట్టే లెక్కల మర్మం గ్రామీణ ప్రజలకైతే అస్సలు అర్థం కావు..పేద మధ్యతరగతి ప్రజలు బడ్జెట్ తో తమ బతుకు మారే అవకాశం లేదన్నట్లుగా లైట్ తీసుకుంటారు.
రెండున్నర ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన మూడు బడ్జెట్లు చూసిన ప్రజలకు ఈసారి బడ్జెట్ లో సంచలనం జరుగుతుందని, మిరాకిల్ జరిగి పేదల బడ్జెట్ గా ఉంటుందన్న నమ్మకం కూడా జనాలకు లేదు.అందుకే బడ్జెట్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు..అంకెల గమ్మత్తులో పేదల బతుకులను మసిపూసి మారేడు కాయ చేయడమే ప్రభుత్వం ఎజెండా కాబట్టి తమకు ఏదో ఒరుగుతుందని, జీవితం మారుతుందన్న ప్రజల ఆశలు ఎప్పుడో ఆవిరయ్యాయి.
.శుక్రవారం అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ ను పరిశీలిస్తే ఇది ప్రజా సంక్షేమ బడ్జెట్ కాదు.. అభివృద్ధి సమాధి బడ్జెట్ అన్నది స్పష్టం అవుతోంది.. కాంగ్రెస్ ది  సంక్షేమ ఎజెండా కాదు సంక్షేమ ప్రజాభివృద్ధి వ్యతిరేక పాలన అన్నది బడ్జెట్ చూస్తే అర్థమవుతుంది.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రూ.3.24 వేల లక్షల కోట్ల బడ్జెట్ పూర్తి ప్రజా  వ్యతిరేకంగా ఉంది..తమది సంక్షేమ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అంటూనే ఆయా వర్గాలకు బడ్జెట్ లో కాంగ్రెస్ తీరని ద్రోహం చేసింది.. దగా చేసింది..నమ్మించి ప్రజలను తేనె పూసిన కత్తి తో గొంతు కోసింది..ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్లకు కాంగ్రెస్ పార్టీ తడిగుడ్డతో ఉరి వేసింది.
అటు బడ్జెట్ లో దళితులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేసింది..దళిత బంధులో కేసీఆర్ పది లక్షలే ఇస్తున్నారు.. మేం రూ.12 లక్షలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ..రెండున్నర ఏళ్ళలో ఒక్క దళితుడికి కూడా దళిత బంధు ఇవ్వలేదు.. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నిధులు విడుదల చేసిన వాళ్ళకు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిపివేసింది..నిధులను వెనక్కి తీసుకుంది.. అకౌంట్స్ ఫ్రీజ్ చేసింది.
 రెండున్నర ఏళ్ళలో ఒక్క దళితుడికి కూడా కాంగ్రెస్ దళిత బంధు  ఇవ్వలేదు..రూ. 12 లక్షలు దేవుడెరుగు కేసీఆర్ ఇచ్చిన రూ. 10 లక్షలు కూడా ఇవ్వడం లేదు.. బడ్జెట్ దళిత బంధుకు పైసా  పెట్టలేదు..దళిత బంధును ఎగ్గొట్టి ద్రోహం చేసింది.. అసలు ఇస్తారో ఇవ్వరో కూడా కాంగ్రెస్ బడ్జెట్ చెప్పలేదు.. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు ఇవ్వడం లేదు.. ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్ట్ భర్తీ చేయడం లేదు.. కేంద్రం, సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసిన తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల్లో వర్గీకరణ ప్రకారం భర్తీ చేయడం లేదు..దళిత్ స్టడీ సర్కిల్ ఊసే లేదు..ఇలా బడ్జెట్ లో దళితులకు అన్యాయం చేసి  అంబేడ్కర్   అడుగుజాడల్లో నడుస్తున్నాం అంటే ఇది కాంగ్రెస్ కన్నింగ్ రాజకీయాలకు నిదర్శనం కాదా.
 తెలంగాణను కాంగ్రెస్ అభివృద్ధిలో కాదు విధ్వంసం వైపు నడిపిస్తుంది..కాంగ్రెస్ తమ దోపిడీ పథంలో తీసుకుపోతుంది.. అభివృద్ధి పథంలో నడిస్తే రాష్ట్ర ఆదాయం ఎలా తగ్గుతుంది..?. రాష్ట్ర దివాలా తీసిందని సీఎం చెపుతున్నారు.. రియల్ ఎస్టేట్, సర్వీస్ సెక్టార్, ఐటీ ఎగుమతులు ఎలా తగ్గుతాయి.  రాష్ట్రంలో అన్నీ రంగాలు ఎలా దివాలా తీస్తాయి..ప్రజల కోనుగోలు ఎలా తగ్గుతుంది.. రాష్ట్ర వృద్ధి రేటు బీఆర్ఎస్ హాయాంలో 12.5 శాతం ఉంటే ఇప్పుడు 10.5కి ఎలా పడిపోయింది.. రాష్ట్ర ఆదాయం పడిపోవడం, అన్నీ రంగాలు విధ్వంసం కావడం వృద్ధి రేటు 2 శాతం తగ్గడమే తెలంగాణ ప్రగతి పథంలో నడుస్తుందని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ కొలమానమా..?.
.ఆడలేక మద్దెలోడు అన్నట్లు..పాలన చేతగగ, అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని దివాలా తీసిందనే తప్పుడు ప్రచారం కాంగ్రెస్  ప్రభుత్వం చేస్తుంది.. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం , ఆర్థిక సంస్థలు తెలంగాణ ఆదాయం బాగుందంటే  ప్రభుత్వం మాత్రం రాష్ట్రం దివాలా  తీసిందంటారు..రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్ లో పదేపదే పాత అప్పులంటూ రోత పాటలే పాడుతుంది.. ఒకవైపు రాష్ట్ర అప్పులు తగ్గించామంటూనే  రెండున్నర ఏళ్ళలోనే దాదాపు రూ. మూడున్నర లక్షల కోట్ల అప్పు చేసినట్లు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ ప్రకటించారు.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్ళుగా పాత అప్పులే కడితే అప్పు తగ్గాలి కానీ ఏలా పెరుగుతుంది..మరీ రాష్ట్ర ఆదాయం ఏమైంది..?.
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తుందని ఇయర్ ఆఫ్ ది జోక్ అసెంబ్లీలో డీసీఎం భట్టి విక్రమార్క చెప్పారు.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ ఎక్కడా పాటించడం లేదు..వెరసి దుబారా ఖర్చులు చేస్తుంది.. ఆర్థిక విధ్వంసం చేస్తుంది.. తెలంగాణ సొమ్ములు దిల్లీకి తరలిస్తుంది..తెలంగాణ డబ్బు ఇరత రాష్ట్రంలో ప్రచారార్భాలాకు ఖర్చు చేస్తుంది.. గాంధీ కుటుంబం ప్రాపకం కోసం విగ్రహాల ఆవిష్కరణలకు కోట్లు ఖర్చు పెడుతుంది.. ఐదు పది కిలోమీటర్ల ప్రయాణానికి కూడా మంత్రులు హెలికాప్టర్లలో తిరుగుతున్నారు.. పార్క్ ల ప్రారంభోత్సవాలను పార్టీ మీటింగ్ లకు వ్యక్తిగత పర్యటనలకు కూడా మంత్రులు హెలికాప్టర్ లో పోతున్నారు..ఇదేనా ఆర్థిక క్రమశిక్షణ అంటే..
ఇక పెట్టుబడులు ఒక బోగస్.. ప్రభుత్వం బడ్జెట్ లో అంకెల గరాడీ ఎలా ఉందో రాష్ట్రంలో పెట్టుబడుల ముచ్చట అలాగే ఉంది.. భారత్ సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్, మిస్ వరల్డ్ పోటీలు, దావోస్ లండన్ అమెరికా పర్యటనలతో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని కాంగ్రెస్ చెపుతుంది.. అందులో వాస్తవం ఏంటో ప్రభుత్వ ఐటీ అండ్ తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చెబుతుంది.. కంపెనీలు రావడం లేదని, పెట్టుబడులు తగ్గాయాని అధికార వెబ్ సైట్లలో నివేదికలు చెబుతున్నాయి. పెట్టుబడు ఆకర్షించడం కాదు..పెట్టుబడులు తరలించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది.. పదేళ్ళ టీఆర్ఎస్ హయాంలో పెట్టుబడులు జాతర జరిగితే రెండున్నర ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో పెట్టుబడుల పాతర జరుగుతుంది.. కొత్త కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టడం తర్వాత కాంగ్రెస్  అసమర్థ పాలనతో ఉన్న కంపెనీలే ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి.
. మిస్టర్ భట్టి విక్రమార్క గారు మీది అభివృద్ధి పాలననో, ఆదర్శవంతమైన పాలననో ఒకసారి మూసీ, లగ చర్ల బాధితులను అడగండి..మీ సొంత జిల్లాలో టెకుమల్ల ప్రజలను అడగండి మీ పాలన ఏంటో చెపుతారు.
.మభ్యపెట్టి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించే వారిని కేసులు పెట్టి వేధించే ప్రభుత్వం కాదని భట్టి బడ్జెట్ స్పీచ్ లో చెప్పారు.. నిజానికి మభ్యపెట్టి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందే కాంగ్రెస్ పార్టీ..హమీలను అడుగుతున్న, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని కేసులు పెట్టి వేధిస్తుంది కాంగ్రెస్..జర్నలిస్టుల అరెస్టులు, రైతులపై కేసులు, నిరుద్యోగులపై కేసులు, ఆశ వర్కర్లు, టీచర్లు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ వేధిస్తుంది.అంతేకాదు ఏకంగా అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలపై, ప్రజా సమస్యలపై, కాంగ్రెస్ గ్యారంటీలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని కాంగ్రెస్ దూషించడం లేదా.. ప్రతిపక్షాన్ని దూషించడం , ప్రశ్నించడం, ప్రజలను హింసించడమే కాంగ్రెస్ విధానం కద..
మరోవైపు  కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని, అభివృద్ధిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫీనిక్స్ పక్షితో పోల్చారు.. బూడిద నుంచి ఫీనిక్స్ పక్షి లేచినట్లు రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకుపోతున్నామని పచ్చి అబద్ధాలతో సభను, ప్రజలను భట్టి విక్రమార్క తప్పుదోవ పెట్టించారు..బూడిద నుంచి ఫీనిక్స్‌ పక్షీ లేవడం కాదు.ఆకామంత ఎత్తులో ఫీనిక్స్ పక్షిలా  ఎగురుతున్న తెలంగాణను రెండున్నర ఏళ్ళలో కాంగ్రెస్‌ బూడిద చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను నిర్వీర్యం చేసింది..సాంస్కృతిక రంగానికి బడ్జెట్ లో మొండి చేయి పెట్టింది.. కళాకారుల జీతాలు కూడా పెట్టలేదు.తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లి చేశారు.బతుకమ్మను ఎత్తేశారు. గద్దర్ అవార్డ్‌లో గద్దర్‌ ఆత్మ గోషించేలా అశ్లీల కచేరి చేశారు. వృద్ది రేటు పెరిగితే రాష్ట్రాదాయం తగ్గింది.. ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయి..విద్య , వైద్య రంగాలకు అరకొర నిధులే కేటాయించింది.. తులం బంగారం లేదు.. విద్యార్థులకు స్కూటీలు లేవు, అవ్వతాతలకు, వికలాంగులకు పింఛన్ పెంచలేదు, ఉద్యోగాల డీఏ, పీఆర్సిలు లేవు, రైతు భరోసా రూ 15 వేలు, కౌలు రైతులకు,రైతు కూలీలకు గుర్తింపు లేదు ఆర్థిక సాయం లేదు.. ఆర్టీసీ అపాయింట్ డే లేదు..యువ వికాసానికి 6 వేల కోట్లు పెట్టిన, గత బడ్జెట్‌లో పెట్టిన బడ్జెట్‌ ఎటు పోయిందో తెలియదు..ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం లేదు..ఆరు గ్యారెంటీలు డిక్లరేషన్లకు ఊసే లేదు..బీసీ బంధు దళిత బంధు లేదు..సబ్ ప్లాన్ లకు కేటాయింపు లేదు..ఉన్నదల్లా రెండున్నర ఏళ్ళ క్రితం ఆరు గ్యారెంటీలు మోసం నేడు రేర్ క్యూర్ ప్యూర్ అంటూ ద్రోహం.. .ఒక్క ముక్కలో చెప్పాలంటే  ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చే బడ్జెట్ కాదు కాంగ్రెస్ నేతల పదవుల కలను నెరవేర్చుకునే బడ్జెట్..ఇది రేర్ క్యూర్ ప్యూర్, రాష్ట్ర ప్రజల బడ్జెట్ కాదు రాహుల్ ,  రేవంత్ బడ్జెట్..!
-తోటకూర రమేష్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *