– పాలమూరును ఎండబెట్టారు
– ఆంధ్రకు నీళ్లిచ్చారు
– అసెంబ్లీలో చర్చిద్దామంటే మూడు నిషాలుండలేదు
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
వనపర్తి, ప్రజాతంత్ర, జనవరి 14; పదేళ్ల కేసీఆర్ పాలనలో ఒక రేషన్ కార్డు గాని ఒక్క ఇల్లు ఇవ్వలేదని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కొత్తకోటలో రూ.15 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కలిసి వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. దాదాపు రూ.15 కోట్ల వ్యయంతో కొత్తకోటలోని వివిధ వార్డుల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.6 కోట్లతో కొత్తకోట మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా చెనగ చెరువు కట్ట అభివృద్ధికి రూ.5 కోట్లు, పట్టణంలోని పార్కుల అభివృద్ధికి రూ.2 కోట్లు కేటాయించారు. అదేవిధంగా రూ.50 లక్షలతో రహదారులపై ప్లాంటేషన్ పనులు, రూ.1.50 కోట్ల వ్యయంతో స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపనలు నిర్వహించారు. ఇదే కార్యక్రమంలో భాగంగా కొత్తకోట పట్టణంలో రూ.1.50 కోట్లతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును మంత్రులు ప్రారంభించారు. ఈ అభివృద్ధి పనుల ద్వారా పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందనున్నాయని తెలిపారు.
మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఆదరించి అక్కున చేర్చుకొని ఎంపీగా గెలిపించారని అన్నారు. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ దయతో తెలంగాణ సాధిస్తే కేసీఆర్ తాను తెలంగాణ తెచ్చానని ప్రజలను నమ్మించి పది ఏళ్ల పాటు గద్దెనెక్కాడని, ఈ సందర్భంలో పాలమూరును వెండబెట్టి ఆంద్రకు సాగునీరు ను సాగనంపడానికి సహకరించారని ఆయన అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడే పుట్టాడు.. ఇక్కడే చదువుకున్నాడు.. అభివృద్ధే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్నాడని, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాడని, ఇది పేదల ప్రభుత్వం అని కాంగ్రెస్ అంటేనే పేదలకు సంక్షేమ పథకాలు అందించే పార్టీ అని ఆయన అన్నారు. కెసిఆర్ 10 ఏళ్ల పాటు పరిపాలన సాగించి ఒక రేషన్ కార్డు గాని ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని ఆయన అన్నారు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పై ప్రేమ లేదని కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టును శర వేగంగా పనులు చేసుకుంటే కెసిఆర్ వత్తాసు పలికాడని అందుకే ఈయన ఎంపీపీ చేతిలో ఘోర పరాజ్యం పాలయ్యాడని అన్నారు రేవంత్ రెడ్డి ఎప్పుడు కనివిని ఎరుగని విధంగా సమ్మక్క సరళక్క జాతర ఉత్సవాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనులు చేస్తున్నాడని ఆయన అన్నారు, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జి మధుసూదన్ రెడ్డి తూడి మేఘారెడ్డి, మాజీ జెడ్పిటిసి పి జె బాబు, ప్రశాంత్, మేస్త్రి శ్రీనివాసులు, పాపయ్య గారి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




