నాన్‌ ‌బెయిలబుల్‌ ‌వారంట్‌అబద్దం: కొండా సురేఖ

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్‌11 :‌బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పరువు నష్టం దావా కేసులో నాన్‌ ‌బెయిలబుల్‌ ‌వారెంట్‌ ‌జారీ అయినట్లు తనపై జరుగుతున్న ప్రచారంపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. కొన్ని పత్రికలు, ఛానళ్లు, వెబ్‌ ‌సైట్లలో తనకు కోర్టు నాన్‌ ‌బెయిలబుల్‌ ‌వారెంట్‌ ‌జారీ చేసినట్లు వార్తలు వొస్తున్నాయన్నారు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం అని ఆమె గురువారం హదరాబాద్‌లో స్పష్టం చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ.. ఫిబ్రవరి 5వ తేదీన ఉందన్నారు. ఆ రోజు జరిగే విచారణకు హాజరుకావాలని కోర్టు తనకు స్పష్టం చేసిందన్నారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *