ముగిసిన నామినేషన్ల ఉపసంహరణలు

– బరిలో 615 మంది అభ్యర్థులు
– సూర్యాపేట జిల్లావ్యాప్తంగా వేడెక్కనున్న రాజకీయాలు

సూర్యాపేట, ప్రజాతంత్ర | ఫిబ్రవరి 3 : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు కొనసాగిన ఉపసంహరణ అనంతరం జిల్లావ్యాప్తంగా ఉన్న ఐదు మున్సిపాలిటీల్లోని 141 వార్డులకు గాను మొత్తం 615 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మున్సిపాలిటీ వారీగా అభ్యర్థుల సంఖ్యను పరిశీలిస్తే, సూర్యాపేట మున్సిపాలిటీలో అత్యధికంగా 264 మంది పోటీ చేయనుండగా, కోదాడలో 130, హుజూర్నగర్‌లో 111, తిరుమలగిరిలో 56, నేరేడుచర్లలో 54 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

సూర్యాపేట మున్సిపాలిటీ (48 వార్డులు – 264 మంది)
ఆప్ పార్టీ – 1, బీఎస్పీ – 3, బీజేపీ – 47, సీపీఐ(ఎం) – 3, కాంగ్రెస్ – 48, బీఆర్ఎస్ – 45, జనసేన – 10, ఏఐఎఫ్‌బి – 3, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలు – 27, స్వతంత్రులు – 78
కోదాడ మున్సిపాలిటీ (35 వార్డులు – 130 మంది)
బీజేపీ – 18, సీపీఐ(ఎం) – 3, కాంగ్రెస్ – 34, బీఆర్ఎస్ – 29, జనసేన – 7, స్వతంత్రులు – 39,
 హుజూర్నగర్ మున్సిపాలిటీ (28 వార్డులు – 111 మంది)
ఆప్ పార్టీ – 1, బీజేపీ – 22, సీపీఐ – 2, సీపీఐ(ఎం) – 1, కాంగ్రెస్ – 25, బీఆర్ఎస్ – 27, జనసేన – 8,
ఇతర గుర్తింపు పొందిన పార్టీలు – 2, స్వతంత్రులు – 23,
 తిరుమలగిరి మున్సిపాలిటీ (15 వార్డులు – 56 మంది)
బీజేపీ – 13, సీపీఐ(ఎం) – 2, కాంగ్రెస్ – 15, బీఆర్ఎస్ – 15, జనసేన – 8, ఇతర గుర్తింపు పొందిన పార్టీలు – 13, స్వతంత్రులు – 8
 నేరేడుచర్ల మున్సిపాలిటీ (15 వార్డులు – 54 మంది)
బీజేపీ – 15, సీపీఐ(ఎం) – 2 కాంగ్రెస్ – 15 బీఆర్ఎస్ – 14,  జనసేన – 1 స్వతంత్రులు – 7

నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో జిల్లాలో మున్సిపల్ ఎన్నికల రాజకీయ సమీకరణాలు పూర్తిగా స్పష్టత పొందాయి. అభ్యర్థుల జాబితా ఖరారుకావడంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యాయి. ఇక నుంచి ప్రచారమే కేంద్రబిందువుగా మారనుండగా, పార్టీల మధ్య మాటల యుద్ధం, ఆరోపణలు–ప్రత్యారోపణలు తీవ్రతరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వార్డు వారీగా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగనున్నాయి. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మక ప్రచారానికి దిగనుండటంతో జిల్లావ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల వేడి మరింత పతాకస్థాయికి చేరనుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *