ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 30 : పట్టణాల అభివృద్ధి ప్రజాప్రతినిధుల చేతుల్లోనే ఉందని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించగలిగేది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లేనని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ ర్యాలీని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, మున్సిపాలిటీల్లో కూడా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. అనేక అంశాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయని పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీ కాంగ్రెస్ పార్టీ బలాన్ని, ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబించిందని నాయకులు పేర్కొన్నారు. నినాదాలతో పట్టణమంతా మార్మోగగా, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పట్టణంలో ర్యాలీల హడావుడి
మున్సిపల్ ఎన్నికýకు నామినేషన్ దాఖలు చేయడానికి చివరి రోజు కావడంతో యాదగిరిగుట్ట పట్టణంలో కాంగ్రెస్. బీఆర్‌ఎస్, బీజేపీలతోపాటు ఇతర పార్టీల, ఇండిపెండెంట్ అభ్యర్థులు భారీ ర్యాలీలు నిర్వహించి నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసే సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు నామినేషన్ కేంద్రానికి వంద మీటర్ల దూరం నుంచి బ్యారికేడ్ల్లు ఏర్పాటు చేసి అభ్యర్థితోపాటు ఇద్దరిని మాత్రమే నామినేషన్ కేంద్రం లోపలికి అనుమతించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





