ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతా..

ఎక్స్‌ వేదికగా ఎద్దేవా చేసిన అసద్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వాలని పాకిస్థాన్‌, ఇజ్రాయెల్‌ ప్రతిపాదించడాన్ని ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్‌ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహులు ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వాలని ప్రతిపాదించారని, అయితే మునీర్‌ భారతదేశంలో ఉగ్రవాదులను పంపించే కీలక వ్యక్తి అయితే, నెతన్యాహు అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు నుండి పారిపోయిన వ్యక్తి, అని అతను పాలస్తీనియన్లపై బహిరంగంగా మారణహోమానికి పాల్పడ్డాడని అసదుద్దీన్‌ ఆరోపించారు. వీరిద్దరి చర్యలకు యుఎస్‌ఎ ఆమోదం ఉందని అసదుద్దీన్‌ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *