– సంక్రాంతికి హ్యాపీగా ఊళ్లకు వెళ్లి రావచ్చు
– ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 10: సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుండి సొంత గ్రామాలకు వెళ్లే వారికి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామని ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈసారి 12 లక్షలు వాహనాలు ఊర్లకు వెళ్తాయని బావిస్తున్నామని, గత ఏడాది తొమ్మిది లక్షల వాహనాలు వెళ్లి వచ్చాయని పేర్కొన్నారు. అలాగే పంతంగి టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందని, అక్కడ టోల్ గేట్ ఓపెన్ చేయాలని చెప్పామన్నారు. డీజీపీతో చెప్పి భద్రత ఏర్పాటు చేశామని, ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి చొప్పున అంబులెన్సులు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. నిలిచిన వాహనాలను క్రేన్ల సహాయంతో తరలించేందుకు ఏర్పాటు చేశామని, టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణ సరిహద్దు వరకు తమ బాధ్యతగా పనులు చేస్తున్నామన్నారు. కాగా, గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధం అయ్యిందని, ఫ్యూచర్ సిటీ నుండి ఏపీలోని బందరు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం టెండర్లను పిలుస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



