నగరంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు

– బంకుల వద్ద బారులు తీరవద్దు
– సోషల్ మీడియా వ‌దంతులు నమ్మొద్దు: కమిషనర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పందించారు. నగరంలో ఇంధన నిల్వలు నిండుకున్నాయనేది అపోహ మాత్రమేనని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నగరవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీల దగ్గర సరిపడ నిల్వలు ఉన్నాయని, సరఫరా ఎక్కడా ఆగిపోలేదని సీపీ తెలిపారు. కొరత ఉందన్న ఆందోళనతో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ కట్టవద్దని, అనవసరంగా ఇంధనాన్ని నిల్వ చేసుకోవడానికి ప్రయత్నించవద్దని పౌరులకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్ యంత్రాంగం ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని, రవాణా సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సోషల్ విÖడియాలో వచ్చే తప్ప్పుడు ప్రచారాలను, వదంతులను నమ్మవద్దని, వాటిని ఇతరులకు షేర్ చేయవద్దని సీపీ హెచ్చరించారు. తప్ప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నగరంలో సాధారణ పరిస్థితులు కొనసాగేందుకు ప్రజలందరూ సహకరించాలని సీపీ కోరారు. రద్దీ వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *